మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి కొన్నారు ఎవరి నుంచి తీసుకున్నారు డబ్బులు ఎలా పంపారు చెప్పాలని సినీ హీరో రవితేజ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఆయనకు ఉక్కిరిబిక్కిరి చేశారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ ఈకేసులో కీలక వ్యక్తి కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వరుసగా ప్రశ్నిస్తోంది.నిన్న హీరో రానా ను ప్రశ్నించిన ఈడీ గురువారం రవితేజను విచారణకు పిలిచింది.
కెల్విన్ సహచరుడు జీషాన్ అలీఖాన్ ద్వారానే డ్రగ్స్ కొనుగోలు చేసిన సమాచారంతో హీరో రవితేజ ను ఈడీ అధికారులు విచారించారు.రవితేజ అతని డ్రైవర్ శ్రీనివాస్, జీషాన్ ను విడివిడిగా ప్రశ్నించారు.
ఈడీ ముగ్గుర్నీ కలిపి విచారించారు.ఈ పరిణామాన్ని ఊహించని రవితేజ అవాక్కయినట్లు తెలుస్తుంది.
పరస్పర విరుద్ధమైన సమాధానాలు చెప్పడంతో విచారణకు మరోసారి పిలుస్తామని అధికారులు చెప్పారు.సుమారు ఆరు గంటల పాటు రవితేజని అధికారులు ప్రశ్నించారు.
ఇదే సందర్భంలో రవితేజకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ సిట్ విచారణలో వెల్లడించిన ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా అధికారులు ప్రశ్నించారు.రవితేజకు డ్రగ్స్ వాడే అలవాటుందన్న ప్రసారం సినీ పరిశ్రమలో జోరుగా ఉంది.
ఇందుకు అనుగుణంగానే సిట్ విచారణ సందర్భంగా కెల్విన్ తోపాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి చిక్కిన వారిలో చాలా మంది రవితేజతో పరిచయాలున్నాయని ఆయనకు డ్రగ్స్ లోని పలువురికి డ్రగ్స్ సరఫరా చేసింది నిజమేనని కూడా అంగీకరించాడు.

రవితేజ ఆచార వ్యవహారాలు పార్టీకి వెళ్లడం అక్కడ ఎవరేవరిని కలుస్తారు.ఇంటికి వచ్చే సమయంలో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే అంశాలతో రవితేజ ఆర్థిక వ్యవహారాలపై డ్రైవర్ శ్రీనివాస్ నుంచి కొంత సమాచారాన్ని అధికారులు రాబట్టారు.ఇదే సమయంలో రవితేజ నుంచి బ్యాంకు స్టేట్ మెట్లు తీసుకున్న అధికారులు అందులో లావాదేవీలపై ప్రశ్నించారు.
జీషాన్ తో పరిచయం.ఆయన గతంలో సిట్ కు తెలిపిన విషయాలను గుర్తు చేసిన అధికారులు ఎన్ని సార్లు డబ్బులు బదలాయించారన్న అంశాలను తెలుసుకున్నారు.
కెల్విన్ ఖాతాలోకి బదిలీ అయిన డబ్బులు కూడా ఆరా తీశారు.

కెల్విన్ నుంచి ఎన్నిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు.ఎంత మొత్తంలాను ఆయనకు అందించారన్న అంశాలపై ప్రశ్నించారు.అనంతరం రవితేజ, శ్రీనివాస్, జీషాన్ కలిపి పలు ప్రశ్నలు సంధించారు.
ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఒకరికొకరు పరస్పర విరుద్ధమైన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.రవితేజ తదితరులను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు.