ఒకప్పుడు మినిమం గ్యారెంటీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతున్నాడు.టచ్ చేసి చూడు, నేల టికెట్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ఫ్లాప్ అయిన కారణంగా రవితేజ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంపై నమ్మకం పెట్టుకున్నాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న కారణంగా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రంపై నమ్మకంగా లేరు.ఏమాత్రం అంచనాలు లేకుండా, భారీ బడ్టెజ్‌తో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మించి పెద్ద తప్పు చేశారు అంటూ సినీ వర్గాల్లో టాక్ మొదటి నుండి వినిపిస్తునే ఉంది.
అంతా అనుకున్నట్లేగా ఇప్పుడు జరుగుతుంది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వరుస నాలుగు సినిమాలు అట్లర్ ఫ్లాప్ అయ్యాయి.దాంతో ఆయనకు కనీసం చిన్న హీరోలు కూడా డేట్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు.కాని రవితేజ మాత్రం గతంలో తనకు సక్సెస్ ఇచ్చాడనే విశ్వాసంతో ఈ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు.
భారీ స్థాయిలో బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రి మూవీస్ వారు రావడంతో శ్రీనువైట్ల అడ్డు అదుపు లేకుండా భారీగా ఖర్చు పెట్టించాడు.దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను శ్రీనువైట్ల తెరకెక్కించాడు.
కాని హీరో రవితేజ మరియు దర్శకుడు శ్రీనువైట్ల గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని కనీసం 15 కోట్లకు కూడా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపడం లేదు.

మైత్రి మూవీస్ వారు తమకున్న పరిచయాలతో సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.కాని సినిమాను మాత్రం 15 కోట్లకు మించి కొనే పరిస్థితి లేదు.దాంతో చేసేది లేక సొంతంగా విడుదల చేయాలనే నిర్ణయానికి మైత్రి వారు వచ్చారు.
ఒకవేళ సినిమా ఫలితం తారు మారు అయితే నిర్మాతలకు ఏకంగ 20 కోట్ల మేరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.సరే అనుకుని 15 కోట్లకు సినిమాను అమ్మేస్తే మరో అయిదు కోట్ల రూపాయలకు ఇతర రైట్స్ ద్వారా వస్తాయి.
అలా 10 కోట్ల లాస్‌తో బయట పడవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి మైత్రి వారి ఆలోచన ఏంటో చూడాలి.







