గరిటె పట్టిన హీరో రామ్... కొత్తగా కనిపిస్తున్నాడు

ఎనర్జిటిక్ స్టార్ గా టాలీవుడ్ తనదైన ముద్ర వేసుకున్న నటుడు రామ్ పోతినేని.

ఈ యంగ్ హీరోకి సరైన సినిమా పడితే తన ఎనర్జీ లెవల్స్ ని ఒక రేంజ్ లో చూపిస్తాడు అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు.

అయితే రొటీన్ కథలు ఎక్కువగా చేయడం వలన కాంపిటేషన్ లో కాస్తా వెనకబడ్డాడు.అయితే ఈ మధ్య ఇస్మార్ట్ శంకర్ తో తనలోని పూర్తిస్థాయి నటుడుని రామ్ బయటకి తీసుకొచ్చాడు.

పూరీ జగన్నాథ్ పూర్తి మాస్ లుక్ లో ఆ సినిమాలో రామ్ ని తెరపై ఆవిష్కరించి సూపర్ హిట్ కొట్టాడు. ఎనర్జిటిక్ స్టార్ అయినా మాస్ ఆడియన్స్ కి చేరువ కాలేకపోయినా రామ్ ఇస్మార్ట్ తో ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ కూడా పెంచేసుకున్నాడు.

ఇక ఇప్పుడు రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.సంక్రాంతి బరిలో ఈ సినిమా పోటీ పడుతుంది.

Advertisement

కెరియర్ లో మొదటి సారి ఈ సినిమా కోసం రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు.అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం విశేషం.ఇదిలా ఉంటే క్రైమ్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని రామ్ అనుకుంటున్నాడు.

ఈ సినిమా కోసం గడ్డంతో మాస్ లుక్ లో ఇన్ని రోజులు కనిపించిన రామ్ తాజాగా తన లుక్ మార్చేసి మళ్ళీ నీట్ సేవ్ తో క్యూట్ గా కనిపిస్తున్నాడు.ఇక హెయి స్టైల్ కూడా మార్చేసి రొమాంటిక్ లుక్ లో అమ్మాయిల మనసులని కొల్లగొట్టడానికి రెడీ అయినట్లు దర్శనం ఇస్తున్నాడు.

తాజాగా గరిటె పట్టుకొని ఎగ్ ఆమ్లెట్ వేసిన ఫోటోని న్యూ లుక్ తో పాటు సోషల్ మీడియాలో పెట్టాడు.ఇప్పుడు ఈ లుక్ తెగ వైరల్ అవుతుంది.

కొత్త సినిమా కోసం ఈ లుక్ లో రామ్ మారి ఉంటాడని టాక్ వినిపిస్తుంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు