హీరో రాజశేఖర్ కల్మషం లేని మనిషి.. అలానే ఉంటాడు.. క్యాష్ ప్రోమోలో అసలు విషయం?

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా.ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హీరో రాజశేఖర్ ఒకరు.

ఈయన తన చిరునవ్వుతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.అలా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్న ఈ హీరో మనసు కూడా ఏమాత్రం కల్మషం లేనిది అని చెప్పాలి.

అయితే ఈ హీరో ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తారు.ఇలా ముక్కుసూటిగా మాట్లాడే హీరోలలో నందమూరి బాలకృష్ణ తర్వాత హీరో రాజశేఖర్ అని చెప్పవచ్చు.

ఇకపోతే రాజశేఖర్ జీవిత కేవలం సినిమాల విషయాల గురించి మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా తరచూ వారి వాదనలను వినిపిస్తూ ఉంటారు.హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజశేఖర్ ఇప్పటివరకు బుల్లితెర కార్యక్రమాలకు రావడం జరగలేదు.

Advertisement

తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా రాజశేఖర్ కుటుంబ సభ్యులు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి వచ్చారు.ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

ఇందులో సుమా మాట్లాడుతూ వెల్కమ్ టు క్యాష్.టాలీవుడ్ యాంగ్రీ మెన్, హీరో రాజశేఖర్ అంటూ తనకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

ఈ క్రమంలో రాజశేఖర్ ఎంట్రీ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు.బుల్లెట్ పై పంచ కట్టుకుని ఆయన క్యాష్ కార్యక్రమానికి ఎంట్రీ ఇవ్వడం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

ఇలా ఈ కార్యక్రమంలో రాజశేఖర్ తో పాటు, ఆయన సతీమణి జీవిత తన కూతుర్లు శివాని, శివాత్మిక హాజరయ్యారు. ఇలా ఈ నలుగురితో సుమా క్యాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన రాజశేఖర్ గారిని సుమ అడుగుతూ క్యాష్ కార్యక్రమం ఎలా ఉంది! సార్ అని అడగగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

రాజశేఖర్ సమాధానం చెబుతూ సూపర్ గా ఉంది.అంటూ కాస్త గ్యాప్ ఇచ్చారు.ఈ గ్యాప్ లో ఏదైనా చెబుతారా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తే రాజశేఖర్ మాత్రం హ అంతే అంటూ ముగించారు.

Advertisement

దీంతో క్యాష్ వేదిక పై నవ్వులు విరబూసాయి.ఇక ఈ కార్యక్రమానికి శివానీ, శివాత్మిక కూడా అచ్చమైన తెలుగు సాంప్రదాయ ఉట్టి పడేలా లంగా ఓణీలు ధరించి క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరి ఈ కార్యక్రమంలో భాగంగా సుమ రాజశేఖర్ కుటుంబంతో ఏవిధంగా క్యాష్ కార్యక్రమం నిర్వహించింది, వీరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది అనే విషయం తెలియాలంటే ఈ పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా రాజశేఖర్ కూతురు ఇద్దరు ఇప్పటికే సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే.

హీరో రాజశేఖర్ "శేఖర్" అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.ఈయన నటించిన ఈ శేఖర్ సినిమా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన "జోసఫ్" అనే సినిమాకు రీమేక్ చిత్రంగా తెలుగులో శేఖర్ అనే పేరుతో తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు