ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న ప్రభాస్.. అందుకే ప్రమోషన్స్ కు దూరమా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ( Adipurush ) 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

వరుసగా ప్రభాస్ నటించిన మూడు సినిమాలు తొలిరోజే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.ఈ అరుదైన రికార్డ్ ప్రభాస్ కు మాత్రమే సొంతమని చెప్పవచ్చు.

మరోవైపు ఆదిపురుష్ ఈవెంట్ కు ప్రభాస్ దూరంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అమెరికాలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను చూశారని సమాచారం అందుతోంది.

బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కాలికి అయిన గాయం ఆయనను ఇప్పటికీ వెంటాడుతోందని తెలుస్తోంది.తిరుపతిలో ప్రభాస్ గాయం వల్ల కొంతమేర ఇబ్బంది పడుతున్నారని సమాచారం అందుతోంది.

Advertisement

ఈ గాయానికి ప్రభాస్ మరోసారి చికిత్స చేయించుకోనున్నారని సమాచారం అందుతోంది.సర్జరీ తర్వాత( Prabhas Surgery ) కొంతకాలం పాటు ప్రభాస్ అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది.సలార్ మూవీ షూటింగ్ కొంతమేర బ్యాలెన్స్ ఉందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మాత్రమే సలార్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సెప్టెంబర్ నెల 28వ తేదీన సలార్ మూవీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా సక్సెస్ సాధించడం గ్యారంటీ అని అదే సమయంలో ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ప్రభాస్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

రాబోయే రోజుల్లో ప్రభాస్ కు మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు