హీరో నితిన్ విడుద‌ల చేసిన రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్`లోని త‌ప్పా..? లిరిక‌ల్ వీడియో సాంగ్‌

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్` సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌.

 Hero Nithin Launched Raj Tharun Standup Rahul Movie Thappa Lyrical Song Details,-TeluguStop.com

ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

తాజాగా ఈ చిత్రంలోని త‌ప్పా? లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను హీరో నితిన్ విడుద‌ల చేశారు.స్వీకర్ అగస్తి స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ బెన్నీ దయాల్ హుషారు గా పాడారు.

ర‌ఘురామ్ సాహిత్యం ఆక‌ట్టు కుంటుంది.ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు.

అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది.తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్ట పడాల్సి వస్తుంది.వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

నటీనటులు:

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు.

సాంకేతిక బృందం

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శాంటో మోహన వీరంకి,

ప్రొడక్షన్ కంపెనీ: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్,

సమర్ఫణ: సిద్దు ముద్ద,

నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి,

సంగీతం: స్వీకర్ అగస్తి,

సినిమాటోగ్రఫర్: శ్రీరాజ్ రవీంద్రన్,

ఎడిటర్: రవితేజ గిరిజెల్లా,

కొరియోగ్రఫర్: ఈశ్వర్ పెంటి,

ఆర్ట్: ఉదయ్,

పీఆర్వో : వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube