ఆన్ లైన్ క్లాసులకు హాజరైన నాని.. ఎందుకంటే?

స్టార్ హీరో నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యాడు.? నాని ఏంటి? ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన నాని తనయుడు జున్ను కోసం ఆన్ లైన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడని తెలుస్తోంది.

టీచర్స్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటున్న నాని తనయుడి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు.నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరైన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

నాని సినిమాల వరకు ఎంత పెద్ద హీరో అయినా తన పిల్లలకు తండ్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ నెరవేరిస్తేనే రియల్ హీరో అనిపించుకుంటాడు.సినిమాల్లో స్టార్ హీరో అనిపించుకున్న తండ్రిగా కూడా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

నాని అభిమానులు కుమారుడితో నాని ఉన్న ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.మరోవైపు నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటించిన వి సినిమా ఈ నెల 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Advertisement

మార్చి నెలాఖరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా పడి ఓటీటీలో రిలీజ్ అవుతోంది.ఓటీటీలో రిలీజ్ అవుతున్న్ అతి పెద్ద సినిమాగా వి సినిమా నిలిచింది.

ఈ సినిమా విడుదల తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలోని మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టే అవకాశం ఉంది.ఈ సినిమాలో సుధీర్ బాబు ముఖ్య పాత్రలో నటిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు