టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని,కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం దసరా.( Dasara ) ఈ సినిమా తాజాగా శ్రీరామనామి పండుగ సందర్భంగా మార్చి 30 వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వం వహించగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

పండుగ వాతావరణం కావడంతో అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో నాని హీరోయిన్ కీర్తి సురేష్( Nani Keerthy Suresh ) అభిమానులతో కలిసి థియేటర్లో సినిమాను సరదాగా వీక్షించారు.వీరితోపాటు దర్శకుడు శ్రీకాంత్ కూడా సినిమాను థియేటర్లో వీక్షించారు.వీరందరూ కూడా క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో ఫాన్స్ తో కలిసి సరదాగా సినిమాను చూశారు.
అయితే స్క్రీన్ లో కనిపిస్తున్న హీరో హీరోయిన్లు వారి ఎదుట కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.నాని ఊర మాస్ పర్ఫామెన్స్ కూడా ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక హీరో నాని కీర్తి సురేష్ లతో అభిమానులు ఫోటోలు దిగేందుకు తెగ ప్రయత్నించారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్టార్ హీరో హీరోయిన్ అయినా కీర్తి సురేష్ నాని అభిమానులతో కలిసి అలా సినిమా చూడటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్ లో నాని సినిమాపై ఓవర్ కాంఫిడెన్స్ తో మాట్లాడిన విషయం తెలిసిందే.
నాని మాట్లాడిన విధంగానే సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి సూపర్ హిట్ గా నిలిచింది.మరి పోను పోను ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి మరి.కొత్త డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెలా తన ప్రతిభను అంటున్నారు నెటిజన్స్.







