ఏపీలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అన్న వార్తలు ఊపందుకున్నాయి.కొంత కాల క్రితం వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొందర్లోనే ముందస్తు ఎన్నికలకు వస్తున్నాయని తరచూతమ పార్టీ అంతర్గత సమావేశాలలో చెప్పేవారు .
రాష్ట్రం ఆర్దికం గా ఇబ్బందికర స్థితి లో ఉందని ఆర్థికంగా ఇక రాష్ట్రాన్ని ముందుకు నడపలని పరిస్థితుల్లో ఉన్న వైసిపి తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వస్తుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దం గా ఉండాలంటూ ఆయన పార్టీ శ్రేణులను సిద్దం చేసేవారు .దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ముందస్తు ఎన్నికల ప్రచారం వాస్తవ రూపం దాల్చలేదు అయితే రెండు వారాల వ్యవది లో మోడీని రెండుసార్లు కలుస్తున్న జగన్( Y.S.Jagan ) తీరు తో ముందస్తు ప్రచారం మరొకసారి వూపందుకుంది .పార్టీ శ్రేణులతో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు(Chandrababu Naidu ) ఈ మేరకు వ్యాఖ్యలు చేశారని నవంబర్ డిసెంబర్లో ప్రభుత్వం ముందస్తు కు వెళ్తుందని ఆ ఊహాగానాల సారాంశం.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో వైసీపీ అధిష్టానానికి భయం పట్టుకుందని , ప్రజాభిమానానికి దూరమయ్యామనే తత్వం బోధపడిందని మరొకపక్క ప్రతిపక్షాల ఐక్యత కూడా ఆ పార్టీకి నిద్రలేకుండా చేస్తుందని తెలుగుదేశం శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజా వ్యతిరేఖత తీవ్రమయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రతిపక్షాలకు బలపడడానికి వ్యూహాలు సమకూర్చుకోవడానికి పొత్తు ద్వారా ఉత్పన్నమయ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన సమయం ఇవ్వకూడదని అందుకే ప్రభుత్వాన్ని రద్దుచేసి సాధ్యమైనంత తొందరలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అవసరమైన మద్దతు కోసమే తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తున్నారని రాజకీయ వర్గాల విశ్లేషిస్తున్నాయి .

అయితే మరొకసారి మంత్రివర్గ విస్తరణ కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వానికి ముందస్తుకు వెళ్లే ఉద్దేశమే లేదని వైసిపి( YCP ) వర్గాలు కొట్టు పాడేస్తున్నాయి.అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి మాత్రం పార్టీపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవడంలో, తమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేసుకోవడంలో మాత్రం వెనకబడ్డామని అభిప్రాయం పార్టీలో బలంగా ఉందట.అందువల్ల ఈ వ్యతిరేకతను తగ్గించుకునేలా అవసరమైన చర్యలు తీసుకుని పార్టీని బలపరుచుకోవడం కోసం వైసిపి అధిష్టానం ప్రయత్నిస్తున్నదని కొంత మంది అంటున్నారు దీన్ని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికల ఊహాగానం కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అనిపిస్తుంది మరి దీనిలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే
.





