యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా నటించిన చిత్రం అశ్వద్ధామ.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు.
అలాగే ఈ చిత్రాన్ని ఉషా ముళ్ళపూడి నిర్మించారు.అయితే ఈ చిత్రంలో అందాల తార మెహరీన్ నటించగా పోసాని కృష్ణ మురళి, హీరో ప్రిన్స్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే తాజాగా నాగ శౌర్య ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు కొందరు తాగేసి డ్రైవింగ్ చేస్తూ, చదువుకోకపోవడం వల్ల అమ్మాయిల పై అత్యాచారానికి పాల్పడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అంతేగాక ప్రస్తుతం కొందరి డ్రైవర్లకు చదువుకోకపోవడం వల్ల వారికి సరిగ్గా చట్టాలపై అవగాహన లేదని అందువల్ల వారు అమ్మాయిలపై అఘాయిత్యాలకి పాల్పడుతన్నారని అన్నారు. దీంతో నగరంలోని టాక్సీ డ్రైవర్ల సంఘం నాయకులు తమకు హీరో నాగ శౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే మూవీ కౌన్సిల్ కమీషన్ కి ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ క్షమాపణ విషయాన్ని ఇప్పటికే మూవీ కౌన్సిల్ కమిషన్ అధికారులు నాగశౌర్య చెప్పినప్పటికీ అతడి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరో మారు హెచ్చరించారు. అయితే ఈసారైనా హీరో నాగ సౌర్య స్పందిస్తాడో లేదో చూడాలి.అయితే ఇది ఇలా ఉండగా నాగశౌర్య నటించిన టువంటి అశ్వద్ధామ చిత్రం గత నెల 31వ తారీఖున భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ అంచనాలకు తగ్గట్టుగా రాణించకపోవడంతో బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
అసలే సినిమా సరిగా ఆడకపోవడంతో నిరాశలో ఉన్నటువంటి హీరో నాగ శౌర్య కి ఇప్పుడు మళ్లీ క్షమాపణ చెప్పాలంటూ కొత్త తలనొప్పి మొదలైనట్లుంది.