టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ చిత్రంతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ హీరో వరుసబెట్టి సక్సెస్‌లు కొడుతున్న సంగతి తెలిసిందే.
కుర్ర హీరోల్లో నితిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న విషయం తెలిసిందే.కాగా తాజాగా ఈ హీరో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
నాలుగేళ్లుగా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ఏప్రిల్‌లో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు నితిన్.కాగా తన పెళ్లిని ఏప్రిల్ నుండి మే నెలకు వాయిదా వేశాడు నితిన్.
పెళ్లి వేడుకకు సంబంధించిన పనుల్లో ఆలస్యం కానుండటంతో నితిన్ తన పెళ్లి వేడుకను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.అతడి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి వేడుక ఏర్పాట్లపై సమయం పడుతుందని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ యంగ్ హీరో.
ఇక తన కాబోయే భార్య శాలినిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమెతో పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారని నితిన్ తెలిపాడు.మరి ఈ పెళ్లి వేడుకలు ఎంత వైభవంగా జరుగుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అటు సినిమాల పరంగా భీష్మ సినిమాతో నితిన్ మనందరినీ అలరించేందుకు రెడీ అయ్మాడు.








