బాబు వెంట ఉన్నది మొత్తం ఎన్టీఆర్‌ అభిమానులే

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అధికారం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని లేదంటే ప్రజలు ఆయన్ను మరింతగా తిరష్కరిస్తారంటూ హెచ్చరించాడు.

 Ap Ycp Minister Anil Kumar Yadav Comments On Chandrababu Naidu-TeluguStop.com

సీఎం జగన్‌ మూడవ కన్ను తెరిస్తే చంద్రబాబు నాయుడు భష్మం అవ్వడం ఖాయం అంటూ మంత్రి అనీల్‌ హెచ్చరించాడు.చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో పాటు ప్రభుత్వంపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నాడంటూ మంత్రి ఎద్దేవ చేశారు.

ఇక ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో ఉన్నది అంతా కూడా ఎన్టీఆర్‌ అభిమానులు అని, ఆయనపై ఉన్న అభిమానంతో ఆయన స్థాపించిన పార్టీని వదల్లేక అలాగే ఉన్నారు.చంద్రబాబు నాయుడుపై ఏ ఒక్కరికి అభిమానం లేదని, ఆయన దమ్ముంటే మామ ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని వదిలి కొత్తగా పార్టీ పెట్టి ఇప్పుడు వచ్చిన ఓట్లను రాబట్టుకోవాలంటూ మంత్రి సవాల్‌ విసిరాడు.

కొత్త పార్టీతో చంద్రబాబు నాయుడుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారంటూ అనీల్‌ అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube