లక్ష్ చదలవాడ( Laksh Chadalavada ) హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ధీర( Dheera Movie ) ఇదివరకు వలయం గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి సినిమాలలో కీలకపాత్రలలో నటించారు.అయితే తాజాగా హీరోగా మారినటువంటి లక్ష్ నటించిన ధీర మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమాలో నేహా పటాన్ హీరోయిన్గా నటించారు.ఇక నేడు ఫిబ్రవరి రెండో తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
కథ:
డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే రణధీర్(లక్ష్) కు ఒక పాతిక లక్షల రూపాయల డబ్బులు వస్తాయని తెలిసి కోమాలు ఉన్నటువంటి ఒక పేషంటును విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకు వెళ్లడానికి సిద్ధమవుతారు.ఇలా అంబులెన్స్ డ్రైవర్గా వెళ్లినటువంటి తనకు అంబులెన్స్ లో డాక్టర్ గా వచ్చినది తన మాజీ ప్రేయసి అమృత ( నేహా పఠాన్)( Neha Pathaan ) ఇక అంబులెన్స్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చంపడానికి కొందరు రౌడీలు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసి రణధీర్ తనని జాగ్రత్తగా హాస్పిటల్లో చేరుస్తారు ఇక హాస్పిటల్ నుంచి తిరుగుతున్నటువంటి క్రమంలో తన ఆంబులెన్స్ లో ఒక తల్లి బిడ్డ ఉన్న విషయాన్ని గమనిస్తాడు.ఆ బిడ్డను కాపాడమని తల్లి చెప్పి రణధీర్ ను ప్రమాదం నుంచి రక్షిస్తుంది.అసలు ఈయన హాస్పిటల్లో జాయిన్ చేసిన కోమాలో ఉన్నటువంటి పేషెంట్ ఎవరు తనని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? తనకోసం ప్రాణాలు వదిలిన ఆ తల్లి బిడ్డను రణధీర్ ఎలా కాపాడగలిగారు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
హీరోగా లక్ష్( Hero Laksh ) నటించిన మొదటి సినిమా అయితే డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే ఓ కుర్రాడు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాల్లో చాలా అద్భుతంగా నటించారని యాక్షన్స్ అన్ని వేషాలలో కూడా చాలా బాగా నటించారని తెలుస్తోంది అలాగే హీరోయిన్ నేహా పఠాన్ ఇతర తారాగణం మొత్తం వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని తెలుస్తుంది.
టెక్నికల్:
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సాయి కార్తీక్( Sai Karthik ) సంగీతం, జానర్‌కు తగినట్లుగా ఉంది.కొన్ని పాటలు క్యాచీగా ఉన్నాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సిటీని పెంచింది.వినయ్ రామస్వామి ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంది.
నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగా ఉండే వ్యక్తిగానే చిత్రీకరించారు అలాంటి వ్యక్తి చిన్నారిని కాపాడటం కోసం 2500 కోట్లను వద్దనుకోవడం ఆసక్తికరంగా మారింది.సినిమా ప్రారంభమైనప్పటి నుంచి హీరో క్యారెక్టర్ ని మాత్రం చాలా డిఫరెంట్ గా ఎస్టాబ్లిష్ చేశారు.ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు తరువాత వచ్చే సన్నివేశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే లాగే ఉంది.మొత్తానికి యాక్షన్ తరహాలో కాస్త డిఫరెంట్ గా ఈ సినిమాని చూపించారు.
ప్లస్ పాయింట్స్:
బ్యాక్గ్రౌండ్ సోర్స్, హీరో నటన, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
మైనస్ పాయింట్:
పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు అక్కడక్కడ సన్నివేశాలను సాగదీత
బాటమ్ లైన్:
చివరిగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇదొక యాక్షన్ సినిమా( Action Movie ) అని చెప్పాలి యాక్షన్ సినిమాలో నచ్చే వారికి ఈ సినిమా నచ్చుతుంది.