సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం కోసం ఈయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే తాజాగా సుహాస్ ( Suhas ) హీరోగా నటించినటువంటి అంబాజిపేట మ్యారేజి బ్యాండ్ ( Ambajipet Marriage Bandu )సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నూతన దర్శకుడు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు.
సుహాస్‌కి జోడీగా శివానీ నాగారం నటించింది.శరణ్, పుష్ప నటుడు జగదీష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు మరి నేను ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.
కథ: అంబాజీపేట అనే గ్రామంలో మ్యారేజీ బ్యాండు కొడుతూ, మరోవైపు కటింగ్ షాప్ నడిపిస్తూ ఉంటాడు మల్లీ(సుహాస్).అతను పద్మవతి(శరణ్య) కవలలు.
ఆమె స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ ఉంటారు.మల్లీకి పెద్దింటికి చెందిన వెంకట్ బాబు(నితిన్ ప్రసన్న) చెల్లి లక్ష్మి(శివానీ నాగారం) అంటే చాలా ఇష్టం.
లక్ష్మి ప్రతిరోజు మల్లి షాప్ ముందు నుంచి కాలేజీకి వెళ్తూ ఉండడంతో ఆమెను చూసి ఈయన ముసి ముసి నవ్వులు నవ్వుతూ తనని ఇష్టపడుతూ ఉంటారు.ఇలా వీరిద్దరూ ప్రేమలో పడతారు అయితే ప్రేమ వరకు ఒకేదాన్ని పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోరని లక్ష్మి చెబుతూనే ఉంది.
ఇక మల్లి సోదరి పద్మాను వెంకట్ బాబు అతని స్నేహితులు అవమాన పరుస్తారు ఈ విషయం మల్లికి తెలిసి ఇద్దరు గొడవపడతారు ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళుతుంది ఇక ఈ క్రమంలోనే లక్ష్మి మల్లి ప్రేమ విషయం తెలిసి వెంకట్ కోపంతో రగిలిపోతారు.ఇలా వీరి మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుంటుంది మరి గొడవ తర్వాత లక్ష్మి ప్రేమ గెలుస్తుందా వెంకట వీరి ప్రేమకు ఒప్పుకుంటారా అన్నది సినిమా కథ.
నటీనటుల నటన: ఈ సినిమాకు నటీనటులే పెద్ద బలం అని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు ఎప్పటిలాగే సుహాస్ కూడా తన నటనతో అందరిని మెప్పించారు.సినిమాకి ప్రాణం పోశాడు.అయితే మొదటి భాగంలో సుహాస్ హీరోగా, సెకండ్ లో శరణ్య హీరోగా కనిపిస్తుంది.పద్మ పాత్రలో శరణ్య అదరొట్టింది.సినిమా అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకుంది.ఇలా ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్: ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్( Shekhar Chandra ) గా పనిచేశారు ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.ఎడిటింగ్ కెమెరా విజువల్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయి.
ఇక డైరెక్టర్ నూతన దర్శకుడు అయినప్పటికీ అలాంటి భావన ఎక్కడా లేకుండా సినిమాని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువచ్చారు.
విశ్లేషణ: గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో సినిమా వస్తుంది అంటే తప్పనిసరిగా కులాల మధ్య వ్యత్యాసం ధనిక పేద ప్రజల మధ్య వ్యత్యాసంతోనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి ఇలా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి ఇక ఈ సినిమా కూడా అలాంటి కోవలోకి వస్తుందని తెలుస్తుంది.పెద్దింటి వాళ్లు తక్కువ కులం వారిని అవమానించడం, అప్పుల పేరుతో ఆస్తులు లాక్కోవడం, పేద, ధనికుల మధ్య ప్రేమ అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.కథగా ఇది పాత అంశమే అయినా, దానినీ కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ప్లస్ పాయింట్: నటీనటుల నటన, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ సోర్స్.
మైనస్ పాయింట్స్: రోటీన్ కథ, అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు.
బాటమ్ లైన్: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మోగితే రీసౌండ్ వచ్చేలాగే సినిమా ఉంది.
రేటింగ్: 3/5