సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో రీమేక్ సినిమాల హవా కొనసాగుతుంది.ఎంతోమంది స్టార్ హీరోలు ఇతర భాషలలో సక్సెస్ అయినటువంటి సినిమాలను మన భాషలోకి రీమేక్ చేస్తూ ఉన్నారు.
అలాగే మన భాష చిత్రాలను కూడా ఇతర భాషలలోకి మనం రీమేక్ చేయటం చూస్తున్నాము.ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు హీరోలు ఇలాంటి సినిమాలలో నటించారు.
కానీ బాలకృష్ణ ( Balakrishna ) మాత్రం ఇలాంటి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటారని చెప్పాలి.ఈయన రీమేక్ ఆ సినిమాలలో నటించడానికి ఇష్టపడరు.
ఇక బాలకృష్ణ సినిమాలన్నీ కూడా పూర్తిస్థాయిలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి సినిమాలు మాత్రమే ఉంటాయి.అంతేకాకుండా బాలకృష్ణ ఇతర సినిమాలలో కూడా గెస్ట్ రోల్స్ అసలు చేయరు.
ఇలాంటి వాటిని దూరంగా ఉంటూ సోలో సినిమాలు చేస్తూ ఉంటారు కానీ ఈయన కెరియర్ లో ఒకే ఒక గెస్ట్ రోల్ చేసినటువంటి సినిమా ఉంది ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పాలి.వెంకటేష్( Venkatesh ) హీరోగా కె మురళీ మోహన్‌రావు దర్శకత్వం వహించిన త్రిమూర్తులు( Trimurthulu ) అనే సినిమా 1987లో విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించగా రాజేంద్రప్రసాద్ అర్జును వంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో హీరోలుగా నటించారు.అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా గెస్ట్ పాత్రలలో కనిపించారు.
వీరితోపాటు ఇండస్ట్రీ మొత్తం దిగింది.కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్స్( Tollywood Stars ) అందరూ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా భారీ మల్టిస్తారు సినిమా( Multistarrer Movie ) అని చెప్పవచ్చు ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ కథలో పస లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి నటించడంతో ఈ సినిమా స్పెషల్ గా నిలిచింది.చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున నలుగురు కలిసి నటించిన సినిమాగా త్రిమూర్తులు సినిమా నిలిచిపోయింది.
ఇక ఈ సినిమాలో తప్ప బాలయ్య ఏ సినిమాలో కూడా గెస్ట్ పాత్రలలో కనిపించలేదు.