తన ఫ్యాన్స్ కి అరుదైన స్థానం ఇచ్చిన బన్నీ.. అవాక్కయిన సమంత

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా సామ్ జామ్ టాక్ షో విజయవంతంగా కొనసాగుతోంది.ఈ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమంత.

చిరంజీవి, రానా, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేశారు.జనవరి 1వ తేదీన అల్లు అర్జున్ ని సమంత అక్కినేని ఇంటర్వ్యూ చేయబోతున్నారు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.జనవరి 1 2021 న ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కానున్న ఈ ఇంటర్వ్యూ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

ఈ ఎపిసోడ్ లో సమంత అల్లు అర్జున్ కుమారుడు అయాన్ తో మాట్లాడారు.అయితే తన తండ్రిని ఒక ప్రశ్న అడగాలని అయాన్ సమంతా ని కోరగా దానికి సరే అని సమంత అల్లు అర్జున్ ని ఓ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది.

Advertisement

ఆ ప్రశ్న ఏమై ఉంటుంది అనేది తెలియాలంటే జనవరి 1వ తేదీన ఆహా లో చూడాల్సిందే.బాగా సెర్చ్ చేసిన సెలబ్రిటీగా అల్లు అర్జున్ నిలిచిన విషయం తెలిసిందే.సౌత్ ఇండియా లో అల్లు అర్జున్ నెంబర్.1 సోషల్ స్టార్ కాగా ఈ విషయం గురించి కూడా సమంతా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కూడా తెలుసుకోవడానికి సమంత ప్రయత్నించారు.

అల్లు అరవింద్ కూడా ఈ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆశ్చర్యానికి గురి చేశారు.అల్లు అరవింద్ కూడా సమంత తో సరదాగా మాట్లాడుతూ ఎపిసోడ్ ని రసవత్తరంగా మార్చినట్లు తెలుస్తోంది.అయితే మీ అభిమానులపై మీరు బాగా ప్రేమను చూపిస్తారు కదా వారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అని సమంత అల్లు అర్జున్ ని ప్రశ్నించగా.అభిమానులది అన్ కండిషనల్ లవ్.తల్లిదండ్రుల తర్వాత అభిమానులే అన్ కండిషనల్ గా ప్రేమిస్తారు అని చెప్పారు.తన తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని తన అభిమానులకు అల్లు అర్జున్ ఇవ్వడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి అల్లు అర్జున్ తన అభిమానులకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ వారితో సరదాగా మెలుగుతుంటారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు