డైరెక్టర్ ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండు నిర్మించాడు.
ఇందులో వెన్నెల కిషోర్, రఘు బాబు, శ్రీ తేజ్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నటించారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు.
రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు.ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందింది.
అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.ముఖ్యంగా అల్లరి నరేష్ కు ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో అల్లరి నరేష్ శ్రీనివాస్ శ్రీపాద పాత్రలో నటించాడు.శ్రీనివాస్ ఒక గవర్నమెంట్ టీచర్.అయితే ఇతడికి ఎలక్షన్స్ డ్యూటీ పడటంతో మారేడుమిల్లి గ్రామానికి వెళ్తాడు.అయితే ఈ గ్రామం ఉందని చాలా వరకు ఎవరికీ తెలియదు.
దీంతో అల్లరి శ్రీనివాస్ ఈ గ్రామంలో బ్రతుకుతున్న ప్రజల కష్టాలను, వారు పడే బాధలను, అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టాలని అనుకుంటాడు.దీంతో అక్కడి వ్యవస్థ మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతాడు.
ఆ సమయంలో శ్రీనివాస్ ఎటువంటి సంఘటనలను ఎదుర్కొంటాడు.చివరికి ఆ ఊరి వాళ్లను కష్టాల నుంచి కాపాడుతాడా లేదా ఆయనకు హీరోయిన్ ఆనంది ఎలా పరిచయం అవుతుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
అల్లరి నరేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం.ఎప్పుడు కామెడీ పాత్రలలో కనిపించే అల్లరి నరేష్ ఈమధ్య మంచి కంటెంట్ సినిమాలతో కనిపిస్తున్నాడు.దీంతో నరేష్ అటువంటి పాత్రలలో కూడా బాగానే పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమాలో ఆయన ఒక టీచర్ గా ప్రభుత్వానికి ఎదురు తిరిగే వ్యక్తిగా బాగా నటించాడు.
హీరోయిన్ ఆనంది కూడా తన పాత్రతో బాగానే ఆకట్టుకుంది.ఇక వెన్నెల కిషోర్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.దర్శకుడు ఈ సినిమా కథను బాగానే ప్రజెంట్ చేశాడు.ఇక ఎమోషన్స్ ఇంకా కాస్త బలంగా రాసుకుంటే బాగుండేది.మ్యూజిక్ కూడా బాగానే ఉంది.సినిమాటోగ్రాఫీ కూడా బాగానే ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగానే పనిచేశాయి.
విశ్లేషణ:
ఒక గ్రామానికి చెందిన ప్రజలను ఏ నాయకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోదు.కనీసం వారికి ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా దేవుడిపై భారం వేసి బతుకుతారు.
ఇక అలా బతుకుతున్న వారిని వెలికి తీసి వారి బతుకులను బయటికి చూపించే విధంగా డైరెక్టర్ మంచి కథను పరిచయం చేశాడు.
ప్లస్ పాయింట్స్:
అల్లరి నరేష్ నటన, కథ, సంగీతం.
మైనస్ పాయింట్స్:
ఎమోషన్స్, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.ఇక నరేష్ కు ఈ సినిమా కమర్షియల్ హిట్ అందిస్తుందని అర్థమవుతుంది.
బాటమ్ లైన్:
చివరగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుందని చెప్పవచ్చు.