రష్యా అందాలు చూడటానికి ఏకంగా 900km బైక్ రైడ్ చేయబోతున్న అజిత్

అజిత్.తమిళ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరో.

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో తమిళ ప్రజల ఆరాధ్య హీరోగా మారిపోయాడు అజిత్.

ఈయనకు సినిమాల్లోనే కాదు.

బయట కూడా బైక్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం.బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం అంటే మరింత ఇష్టం.

ఇప్పటికే బైక్ మీద ఇండియాలోని పలు చోట్లకు ఆయన బైక్ మీద వెళ్లాడు.అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లోనూ విహరించాడు.

Advertisement
రష్యా అందాలు చూడటానికి ఏకంగా 9

ఇండియాలో సూపర్ హీరోగా కొనసాగుతూ. బైక్ రైడింగ్ చేయడం అనేది అజిక్ కు మాత్రమే స్పెషల్.

ఈయనలా మరే హీరో కూడా బైక్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఉండరని చెప్పుకోవచ్చు.తాజాగా ఆయన విదేశాల్లో సైతం బైక్ రైడింగ్ చేయబోతున్నాడు.

ఇంతకీ అతడు ఎక్కడ ఈ రైడింగ్ చేయబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వాలిమై.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రష్యాలో కొనసాగుతుంది.ఇప్పటికే అక్కడి షెడ్యూల్ ఇంచుమించు కంప్లీట్ అయ్యింది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

మిగతా యూనిట్ సభ్యులు కూడా ఇప్పటికే ఇండియాకు తిరిగి వచ్చారు.అజిత్ మాత్రం అక్కడే ఉన్నాడు.

Advertisement

దానికి కారణం.ఆయన తన బైక్ మీద సుమారు 900 కిలో మీటర్ల దూరం ప్రయణించబోతున్నాడట.

ఇందుకోసం సుమారు 5 రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది.రష్యాలో బైక్ మీద తిరుగుతూ అక్కడి అందాలను తిలకించనున్నాడట అజిత్.

అటు ఇప్పటికే అజిత్ తాజా సినిమా వాలిమై విడుదల కావాల్సి ఉండేది.కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని పలు మార్లు షూటింగ్ వాయిదా పడింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమా మీద ప్రస్తుతం బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి.

జనాల అంచనాలను అందుకుంటుందో? లేదో? అని సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా ఈ ఏడాది చివరలో ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా వార్తలు