యశోద టీజర్ పై స్పందించిన అడివి శేష్.. బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ఆగలేకపోతున్నానంటూ ట్వీట్!

సోషల్ మీడియాకు దూరమైనటువంటి సమంత తాజాగా తాను నటించిన యశోద సినిమా టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.ఈ క్రమంలోనే తన టీజర్ కి సంబంధించిన విషయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

 Hero Adivi Sesh Comments On Samantha Yashoda Teaser Details, Yashoda Teaser, Adi-TeluguStop.com

సమంత ప్రధాన పాత్రలో హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యశోద.లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో సమంత ఎంతో అద్భుతంగా నటించారని తెలుస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

ఈ సినిమాలో సమంతను ఒక ప్రెగ్నెంట్ లేడీగా చూపిస్తూ ఆమె ఎంతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సూచించారు.అయితే తనకు ఎంతో క్లిష్టతరమైన పరిస్థితిలో ఎదురవుతూ ఉండడం వల్ల ఆ పరిస్థితులను తాను ఎలా ఎదుర్కొందనే విషయంపై టీజర్ ఎంతో అద్భుతంగా కట్ చేసి చూపించారు.

ఇలా ఈ టీజర్ చూస్తుంటేనే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.ఇకపోతే సమంత యశోద టీజర్ పై యంగ్ హీరో అడివి శేష్ స్పందించారు.

Telugu Adivi Sesh, Samantha, Yashodas Teaser-Movie

ఈ సందర్భంగా అడవి శేష్ సమంత చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ.మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ఆకలేకపోతున్నాను సామ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో కనిపించగా వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు సమంత ఖుషి సినిమాలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక త్వరలోనే యశోద సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube