ఒక్కసారి సినిమాలో స్టార్ అయ్యారంటే చాలు వారు ఏం చేస్తే వారి అభిమానులు అదే ఫాలో అవుతూ ఉంటారు.వారు పెట్టే బొట్టు, కట్టే బట్టలు ప్రతి ఒక్కటి కూడా ట్రెండింగ్ లో ఉంటాయి.
వారు ఏం పని చేసిన అది వార్తా విశేషమే అవుతుంది.అలా ఈ మధ్యకాలంలో మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ బాగా తెలివి మీరు పోయి కొంత స్టార్ డాం రాగానే వారి సొంత బ్రాండ్స్ ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు.
అలా మన టాలీవుడ్ స్టార్స్ మెయింటైన్ చేస్తున్న బ్రాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం
సమంత
ఈ అక్కినేని మాజీ కోడలు తన పేరు పై ఓ సొంత బ్రాండ్ ని మార్కెట్లో ప్రవేశపెట్టి దానికి మంచి డిమాండ్ ని తెచ్చుకుంది.ఆమె బ్రాండ్ పేరు సఖి.ప్రస్తుతం ఈ బ్రాండ్ మార్కెట్లో ట్రేండింగ్ లో ఉండటం విశేషం.
విజయ్ దేవరకొండ

సంచలనాలకు మారుపేరైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన టైంలోనే తన సొంత బ్రాండ్ ని మార్కెట్లో విడుదల చేశాడు.రౌడీ బాయ్స్ అంటూ తాను రిలీజ్ చేసిన బ్రాండ్ కి మార్కెట్లో మంచి పాపులారిటీ ఉంది.
దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ నడిపిస్తున్న ఓట బ్రాండ్ కి సైతం మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. సీత రామం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిన దుల్కర్ 2012 నుంచి మలయాళ ఇండస్ట్రీలో ఫేమస్ స్టార్ గా ఉన్నారు.అందుకే అయన బ్రాండ్ కూడా సూపర్ పాపులర్ గా ఉంది.
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా బీయింగ్ హ్యూమన్ అనే తన బ్రాండ్ ని మార్కెట్లో చాన్నాళ్ల నుంచే కొనసాగిస్తున్నారు.ఈ బ్రాండ్ కి దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది.
రామ్ పోతినేని

హీరో రామ్ నడిపిస్తున్న బ్రాండ్ పేరు రాపో. రామ్ సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా బిజినెస్ లో మాత్రం దూసుకుపోతున్నారు.ఇక రామ్ తన బ్రాండ్ కి మంచి డిమాండ్ కల్పించుకున్నారు.








