ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరో గా, కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం ” గుట్టు చప్పుడు “. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ హీరో, హీరోయిన్ ల రొమాంటిక్ & మాస్ యాంగిల్ ను చూపిస్తున్న పోస్టర్, మోషన్ పోస్టర్ లను హీరో అడవి శేషు చేతులు మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో అడవి శేషు మాట్లాడుతూ మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని, నాకు డైరెక్టర్ గారికి ఇది నిజంగా ఫస్ట్ మూవీ నా అని చాలా డౌట్ గా ఉందని అన్నారు.ఆయనలో చాలా సీనియారిటీ ఉందా అనిపించేలా టాలెంట్ కనిపిస్తుంది, మ్యూజిక్ కూడా సూపర్ ,ఆ మ్యూజిక్ కి, ఎఫెక్ట్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయ్, మూవీకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ గారి ని ప్రోత్సహిస్తున్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి కూడా కంగ్రాట్స్, అండ్ గుట్టు చప్పుడు హోల్ టీం కి కంగ్రాట్స్ అని అన్నారు.
డైరెక్టర్ మణింద్రన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మా మూవీ 2nd లుక్ పోస్టర్ ని ఆయన చేతుల మీదుగా విడుదల చేసినందుకు, హీరో అడవి శేషు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మా మూవీ 1st లుక్ పోస్టర్ కి అనూహ్య స్పందన వచ్చింది.ఆ హ్యాపీనెస్ కంటిన్యూ చేయడానికి ఉగాది సందర్భంగా గుట్టు చప్పుడు మూవీ 2nd లుక్ ని విడుదల చేసాం.
అలాగే నాకు ప్రొడక్షన్ పరంగా నాకు అండగా ఉన్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి నేను రుణపడి ఉంటాను.అని అన్నారు.
హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ అడవి శేషు గారికి థ్యాంక్ యు చెబుతూ అన్న మీ మేజర్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను, గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా ముందు ముందు చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, డైరెక్టర్ మేకింగ్ ఏంటో అని మీరు స్క్రీన్ పై చూస్తారు.ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గారు గూస్ బమ్స్ వచ్చే ఆర్ ఆర్ & సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నారు.ఇంకా D.O.P రాము గారు మేకింగ్ సూపర్.మరోసారి తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ముగించారు.
ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.మా గుట్టు చప్పుడు 2nd లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసిన హీరో అడవి శేషు గారికి థ్యాంక్ యూ, వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నటువంటి హీరో ఉగాది సందర్భంగా 2nd లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
త్వరలో టీజర్ అండ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.
కెమెరామెన్ రాము మాట్లాడుతూ ఇంత మంచి మూవీ కి నన్ను కెమెరామెన్ గా తీసుకునేందుకు డైరెక్టర్ మణింద్రన్ గారికి, ప్రొడ్యూసర్.లివింగ్ స్టన్ గారికి కృతజ్ఞతలు, అలాగే మా హీరో సంజయ్ రావ్ గారి గురించి చెప్పాలంటే సేమ్ బ్రహ్మాజీ గారిలా సెట్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారు అని అన్నారు.
బ్యానర్:- డాన్ ఎంటర్టైన్మెంట్, కాస్టింగ్ :- సంజయ్ రావు, అయేషా ఖాన్, వినోద్ కుమార్, మధుసూదన్, రవి, ప్రకాష్ తదితరులు, ప్రొడ్యూసర్ :- లివింగ్ స్టన్, రచయిత-దర్శకుడు మణింద్రన్, డైలాగ్స్ – ఏ.సురేష్ కుమార్, డీవోపీ – రాము, సంగీతం గౌర హరి, ఎడిటర్ : రాజు తలారి, వీఎఫెక్స్: చందు & ఆది, సౌండ్ ఎఫెక్ట్ : పురుషోత్తం రాజు, ఆర్ట్ : నాగు, పీఆర్వో : సురేష్ కొండేటి, డిజైనర్ : ఇమేజ్ 7 అడ్వేర్టిసింగ్.