ఇదెక్కడి ఐడియా బాబోయ్.. రూ.2,000 నోట్‌లా వెడ్డింగ్ కార్డు ప్రింట్!

ప్రజెంట్ జనరేషన్ పీపుల్ ప్రతీ స్పెషల్ అకేషన్‌ను క్రియేటివ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాంటి క్రియేటివ్ అకేషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే, జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ముఖ్యమైన ఘట్టం పెళ్లిని చాలా స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.ఒక్కోసారి వారి ఐడియాలు అబ్బురపరిచేలా ఉంటున్నాయి.

కాగా తాజాగా ఒక వధువు తండ్రి తన కూతురు వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్స్ చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వెడ్డింగ్ కార్డు తెగ వైరల్ అవుతోంది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్ అనే వ్యక్తి తన చిన్న కుమార్తె పెళ్లి కోసం వెరైటీగా కార్డ్స్ కొట్టించాడు.

Advertisement

ఫిబ్రవరి 1న జరగబోయే తన చిన్న కుమార్త పెళ్లి అతను 2,000 రూపాయల నోటు లాంటి పెళ్లి కార్డులు తయారు చేయించాడు.ఈ పెళ్లి కార్డు చూసేందుకు అచ్చం 2,000 నోటు లాగానే అని ఉంది.

ఈ నోటుకు ఒకవైపు పెళ్లి తేదీ వివరాలను ప్రింట్ చేయించాడు.ఈ వెడ్డింగ్ కార్డ్ అందుకోగానే ఇదేంటి 2000 కాగితం ఇస్తున్నారని చాలామంది బంధుమిత్రులు అనుకున్నారు కానీ అది ఒక పెళ్లి కార్డుని తెలిసి తర్వాత ఆశ్చర్యపోవడం వారి వంతయింది.

తర్వాత వారిలో కొందరు "ఇదిగో చూడండి, వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఎంత క్రియేటివ్ గా ఉందో!!" అంటూ సోషల్ మీడియాలో వాటి ఫొటోలు షేర్ చేశారు.దీన్ని చూసి వామ్మో ఇదెక్కడి ఐడియా బాబోయ్, ఈ పెళ్లి కార్డును ఎవరు పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు