Skin Tight And Bright :ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మం టైట్ గానే కాదు బ్రైట్ గా కూడా మారుతుంది!

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ముఖ చర్మం సాగిపోతూ ఉంటుంది.కండరాలు పట్టుత్వాన్ని కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది.

అయితే చర్మం సాగటం వల్ల ముఖంలో కాంతి తగ్గుతుంది.మునుపటి అంత అందంగా కనిపించలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే సాగిన చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడం కోసం తోచిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను గనుక పాటిస్తే చర్మం టైట్ గానే కాదు బ్రైట్ గా కూడా మారుతుంది.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ను వేసుకోవాలి.

Advertisement
Here Is A Simple Tip For You To Make Your Skin Tight And Bright , Bright Skin, S

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసుకుని స్పూన్స్ తో మిక్స్ చేసుకోవాలి.

చివరిగా సరిపడా ఫ్రెష్ కొబ్బరి నీళ్లు పోసి అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Here Is A Simple Tip For You To Make Your Skin Tight And Bright , Bright Skin, S

ఆపై ఏదైనా మంచి మాయిశ్చరైజ‌ర్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ చిట్కాను క‌నుక పాటిస్తే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.అలాగే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతక‌ణాలు తొలగిపోతాయి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

దీంతో స్కిన్ బ్రైట్ గా మారుతుంది.అంతే కాదు ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల చ‌ర్మ ఛాయ మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను డైలీ రొటీన్ లో భాగం చేసుకోండి.అందంగా మరియు యంగ్ గా మెరిసిపోండి.

తాజా వార్తలు