Allu Arvind Balakrishna: నెపోటిజంపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వారసత్వం ఉందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బయట వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించాలని కేవలం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీల పిల్లలకి చాలా తొందరగా అవకాశాలు వస్తాయి అంటూ చాలామంది నెపోటిజం గురించి మాట్లాడుతూ ఉంటారు.

 Allu Arvinds Shocking Comments On Nepotism What Are They , Allu Arvind, Shocking-TeluguStop.com

ఈ విధంగా ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి ఇప్పటికే ఎంతోమంది ఎన్నో విషయాలను వెల్లడించారు.తాజాగా నెపోటిజం గురించి అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా నెపోటిజం గురించి చర్చలు వచ్చాయి.

ఈ క్రమంలోనే బాలకృష్ణ అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ నెపోటిజం గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ నెపోటిజం అంటూ విమర్శలు చేస్తున్నవారు తమ గుండెలపై చేయి వేసుకొని నిజాయితీగా ఏ రంగంలో నెపోటిజం లేదో చెప్పమని ప్రశ్నించారు.

ఇలా నెపోటిజం గురించి విమర్శలు చేస్తున్న వారికే కనక ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా?చిన్నప్పటినుంచి ఇదే వాతావరణంలో పెరిగి ఈ వృత్తిపై ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడికి రావడం సర్వసాధారణం.ఇక టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ చూపించిన మార్గంలో వెళ్లడం ఏమాత్రం తప్పు కాదు.ఇప్పటికే ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తమ పిల్లలను కూడా అదే వృత్తిలోకి తీసుకువెళ్తున్నారు మరి దీనిని నెపోటిజం అనరా?మరి దీనిని ఏమంటారు అంటూ పెద్ద ఎత్తున ఈయన నెపోటిజం గురించి ఘాటుగానే రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం నెపోటిజం గురించి అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Allu Arvind's Shocking Comments On Nepotism

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube