ప్రతి స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలివే!

మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నో ఆచార సంప్రదాయాలను పాటిస్తుంటారు.

ఈ క్రమంలోనే మన హిందూ ధర్మం ప్రకారం ముఖ్యంగా స్త్రీలు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.

ఈ నియమాలను స్త్రీలు తప్పనిసరిగా పాటించాలని మన హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.మరి స్త్రీలు పాటించాల్సిన నియమాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతిరోజు స్త్రీలు తప్పనిసరిగా ఉదయమే స్నానం చేయాలి అయితే తమపై ఉన్న దిష్టి తొలగిపోవాలంటే స్నానం చేసే నీటిలో వారంలో ఒక్కసారైనా కాస్త ఉప్పు వేసుకుని స్నానం చేయాలి.ఇలా స్నానం చేసినప్పుడు వారిపై ఉన్న దిష్టి తొలగిపోతుంది.

అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు చాతి పై లేదా అరికాళ్లలో కాస్త దిష్టి చుక్కను పెట్టుకొని వెళ్ళాలి.ఇలా పెట్టుకుని వెళ్లడం వల్ల మనం వెళ్లిన చోట ఎక్కడ మనపై నెగిటివ్ ప్రభావం పడకుండా ఉంటుంది.

Advertisement

ఇక వారంలో ఒక్కసారైనా తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేసుకోవాలి.ముఖ్యంగా ఆడవాళ్లకు తగిలే దిష్టి మొత్తం వెంట్రుకలలోనే ఉంటుంది.కనుక వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేయటం వల్ల దిష్టి మొత్తం తొలగిపోతుంది.

ఇక అష్టమి ఆదివారం వంటి దినాలలో దుర్గాష్టమి స్తోత్రాన్ని చదవాలి.చాలా మంది జుట్టుకు ఏ మాత్రం నూనె లేకుండా ఉంటారు అయితే తలకు నూనె రాయడం ఎంతో మంచిది.

ఇక మీ జన్మ నక్షత్రం ప్రకారం వారానికి ఒకసారైనా ఇంటి దేవుడికి వెళ్లి రావాలి.ఇలా వెళ్లలేని పక్షంలో దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024
Advertisement

తాజా వార్తలు