ప్రిన్స్ మహేశ్ బాబు సినీ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన బాల నటుడిగా తన తండ్రి సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రిన్స్ మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఇలా మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే మహేష్ బాబు సినీ జీవితంలో కొన్ని కారణాల వల్ల ఎన్నో సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది.అలా మహేష్బాబు వదులుకున్న సినిమాలలో కొన్ని అద్భుతమైన విజయాలను అందుకోగా మరికొన్ని పరవాలేదనిపించినా సినిమాలు కూడా ఉన్నాయి.
అంతే కాదు, ఆయన చెంతకు వచ్చిన మంచి సినిమాలను కూడా మహేశ్ రిజెక్ట్ చేశారట.వాటిలో ఇడియట్, గజిని, 24 లాంటి మూవీస్‌ని ఆయన తిరస్కరించినట్లు సమాచారం.
ఇక వివరాల్లోకి వెళితే, తనతో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఆగిపోయిన సంఘటనలు కూడా లేకపోలేదు.అలా మహేశ్ హీరోగా, ఒక ప్రాజెక్టును అఫీషియల్‌గా ప్రకటించి, కనీసం షూటింగ్‌కు కూడా వెళ్లకుండానే ఆగిపోయిన 9 సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అందులో మొదటిది సైన్యం. అర్జున్ మూవీ తర్వాత ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా, గుణశేఖర్ దర్శకత్వంలో సైన్యం మూవీ మొదలైంది.
పోకిరీ కంటే మహేశ్ ఈ సినిమా చేయాల్సి ఉంది.కానీ పోకిరీ తర్వాత పూర్తిగా మారిపోయిన మహేశ్ ఇమేజ్‌కి ఇది సెట్టవ్వదని ఆ ప్రాజెక్టును అలానే వదిలేశారు.
దీన్ని నిజం చేస్తూ సైనికుడు సినిమా కూడా పరాజయం పాలవడంతో ఇక సైన్యం సినిమా వెలుగులోకి రాలేదు.
ఆ తర్వాత మిర్చి.
వీడు చాలా హాట్ గురూ.అయితే ఖలేజా మూవీ చాలా లేటు కావడం వలన జాస్తి హేమాంబర్ మంచి అవకాశాన్ని కోల్పోయారు.
ఇక పోతే వరుడు అనే టైటిల్ అనుకున్న సినిమా కూడా ఖలేజా లేటు కారణంగా కార్యరూపం దాల్చలేదు.అయితే బోయపాటి డైరక్టర్‌గా, మహేశ్ హీరోగా ఒక పవర్ పుల్ స్టోరీతో మరో సినిమా ప్రకటన వచ్చింది.
సినిమానైతే ప్రకటించారు.ఆ తర్వాత వాటి ఊసే లేదు.

ఇకపోతే మిస్టర్ ఫర్‌ఫెక్ట్. మహేశ్ బాబు, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా ఒక మూవీని అనౌన్స్ చేశారు.40కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు ప్రకటించిన ఈ మూవీలో దూకుడు సినిమాతో ఆగిపోయింది.ఆ తర్వాత వీరుడు.2013లో మణిరత్నం డైరక్షన్‌లో మహేశ్‌తో ఒక సినిమా చేస్తామన్నట్టు ఆయనే ప్రకటించారు.కానీ అది కూడా ఆగిపోయింది.
అత్తారింటికి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ ఒక సినిమా కన్ఫార్మ అయింది.అదే హరే రామ హరే కృష్ణ. అది కూడా చివరికి కార్యరూపం దాల్చలేదు.ఆ తర్వాత జనగణమన.
ఎంతో మంది ప్రిన్స్ అభిమానులు అప్పట్లో ఎంతో ఎదురుచూసిన సినిమా ఇది.పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో 2016లో ప్రారంభమవుతుందనుకున్న ఈ సినిమా, రకరకాల అంతర్గత కారణాలతో ఆగిపోయింది.

అనంతరం వంశీ పైడిపల్లి మూవీ.సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈయన దర్శకత్వంలో తన తర్వాతి మూవీ ఉంటుందని మహేశ్ ప్రకటించారు.అయితే ఆ సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం మార్చమని మహేశ్ చెప్పడంతో అది పక్కన పెట్టి, సర్కారు వారి పాట చేయడం మొదలుపెట్టారు.ఇవి మహేశ్ కెరీర్లో అనౌన్స్ అయ్యి ఆగిపోయిన 9 సినిమాలుగా ఉండిపోయాయి.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ఉందని త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సారిగా భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్నారని అందుకు కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.