ఇదేందయ్యా ఇది : అక్కడ సైకిల్ కి తొక్కేటప్పుడు కూడా హెల్మెట్  పెట్టుకోవాలట... లేకపోతే...

మామూలుగా మన దేశంలో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది.

 ఇందులో ముఖ్యంగా ద్వి చక్ర వాహనం నడిపేటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.

 లేకపోతే పోలీసులు జరిమానా విధించడం మనం తరచూ నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. కానీ ఆ దేశంలో మాత్రం సైకిల్ పై ప్రయాణించేటప్పుడు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి.

 లేకపోతే పోలీసులు చలానా రాసి జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు ఆ దేశం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రపంచంలోనే వాయువ్య ఐరోపా దేశాలలో నెదర్లాండ్స్ దేశం ఒకటి.ఈ దేశంలో పర్యావరణ కాలుష్యానికి ప్రమాదకరంగా ఉండేటువంటి ఉత్పత్తులను పూర్తిగా నిషేధించారు.

Advertisement

 ఇందులో భాగంగా ఈ దేశంలోని ప్రజలు ఎక్కువగా సైకిళ్లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రభుత్వం కూడా  ఈ సైకిళ్ళని ఉపయోగించే వారి కోసం ప్రత్యేకంగా రహదారులను కూడా  అందుబాటులోకి  తెచ్చింది.

 ఈ క్రమంలో రోడ్డుపై సైకిల్ పై ప్రయాణం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ దరించాల్సి  ఉంటుంది.పొరపాటున ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా సైకిల్ పై రోడ్డుపైకి వస్తే కచ్చితంగా పోలీసులు చలానా విధిస్తారు.

ఒకవేళ పోలీసులు విధించిన చలానా ని చెల్లించ లేకపోతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

అంతేగాక ఇక్కడ సైకిల్ మీద వెళ్తున్నటువంటి వారు నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులకు సైకిల్ కి తగిలించినా పాదచారులపై పోలీసులు చట్టపరమైన  చర్యలు తీసుకుంటారు. కానీ సైకిల్ మీద వెళ్లేటువంటి వ్యక్తుల పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు.కాబట్టి ఈ నిబంధన తెలుసుకోకండా నెదర్లాండ్స్ దేశానికి వెళ్ళకండి.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

ఈ దేశంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ కలిసి పెళ్లి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.అంతేగాక ఇటీవలే ప్రభుత్వం ఈ ట్రాన్స్ జెండర్స్ వివాహాలని చట్టపరం చేసింది.

Advertisement

ఇలాంటి వింత చట్టాలు నెదర్లాండ్స్ దేశంలో చాలానే ఉన్నాయి.ఇందులో ఈ దేశంలో టపాసులు కొనడంగాని,  ప్రభుత్వ అనుమతులు లేకుండా అమ్మడం కానీ నిషేధం.

 ఒకవేళ ప్రభుత్వ అనుమతులు లేకుండా టపాసులను ఎవరైనా అమ్మితే కచ్చితంగా జైలు శిక్ష తప్పదు.కథ ఈ దేశంలో ఎక్కువ శాతం ప్రజలు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు.

ఆ తర్వాత మరో 4 శాతం మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు.కాగా ఈ దేశంలో ప్రజలు ఎక్కువగా డచ్ భాషను మాట్లాడుతారు.

తాజా వార్తలు