హైదరాబాద్ లో కుండపోత వర్షం..!!

మరోసారి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది.దాదాపు రెండుగంటలకుపైగా వర్షం కురుస్తుండటంతో నీళ్లు రోడ్లపైకి వచ్చాయి.

ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.రెండు గంటలకు పైగా దంచికొడుతున్న వాన.నగర వాసులకు అనేక ఇబ్బందులు కలిగిస్తూ ఉంది.మలక్ పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, అబ్దుల్లాపూర్ మేట్, దిల్ సుక్ నగర్, సరూర్ నగర్, చంపాపేట్ లో.వర్షం బీభత్సంగా కురుస్తుంది.మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, శంషాబాద్ లో కూడా వర్షం భారీగా కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రజలెవరూ ఇంటిలో నుండి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.

భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో జిహెచ్ఎంసి ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించడం జరిగింది.ఇదే తరుణంలో లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేశారు.అనవసరంగా ఇళ్లల్లో నుండి ప్రజలు బయటకు రావద్దని జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు