శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్ లో బంగారం భారీగా పట్టుబడింది.ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు సుమారు రూ.7.396 కేజీల గోల్డ్ ను సీజ్ చేశారు.కాగా పట్టుబడిన బంగారం విలువ రూ.4.21 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే హౌరా – చెన్నై మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో తరలిస్తుండగా పట్టుకున్నారని తెలుస్తోంది.







