వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ షర్మిల నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇవాళ పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.మరోవైపు వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు.
షర్మిలను జైలులో ఆమె పరామర్శించనున్నారు.కాగా పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా షర్మిల అరెస్ట్ ను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు.