టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు వినింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సీఐడీ విచారణకు సహాకరిస్తానని పిటిషన్ లో పేర్కొన్నారు.కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ లో కోరారు.
అదేవిధంగా కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని తెలిపారు.ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.







