చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

ఈ పిటిషన్ పై గత మూడు రోజులుగా వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే కోర్టుకు తెలిపారు.అటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు పేర్కొన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ నిన్నటితో ముగియగా వర్చువల్ గా ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు అధికారులు.

ఈ క్రమంలో చంద్రబాబు రిమాండ్ ను ఈనెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
నెలవారీ ప్లాన్‌ ధరలను పెంచేసిన నెట్ ఫ్లిక్స్.. ఎంత పెంచిందంటే..

తాజా వార్తలు