బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.తీహార్ జైలులో తనను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12 గంటలకు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఎమ్మెల్సీ కవితను జైలులో విచారించేందుకు ఈ నెల 5వ తేదీన సీబీఐ కోర్టు( CBI Court) అనుమతి పొందింది.
ఈ క్రమంలోనే 6వ తేదీన సీబీఐ ఆమెను ప్రశ్నించింది.
దీంతో కవిత సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కాగా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సీబీఐ తనను ప్రశ్నించిందని కవిత కోర్టుకు తెలిపారు.ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన న్యాయస్థానం కవితను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారని సీబీఐని ప్రశ్నించింది.
అందుకు సమయం కావాలని సీబీఐ కోరడంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి విచారణ జరపనుంది.