సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి నయనతార ( Nayanatara ) ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ఇలా హీరోయిన్గా సౌత్ సినిమాలలో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి నయనతార వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు డైరెక్టర్ విగ్నేష్ శివన్( Vignesh Shivan ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా మారారు.
ఇలా ఈమె సరోగసి ద్వారా పిల్లల్ని కనడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వివాదాలకు కారణమైంది.అయితే మీరు పెళ్లికి ముందే ప్లాన్ చేసుకున్నారని అన్ని ఆధారాలు చూపించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.నయనతార ఇలా పిల్లల్ని కనడంతో చాలామంది ఆమె హీరోయిన్ గా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు.
పిల్లల్ని కంటే తన అందం పాడవుతుందని సినిమా అవకాశాలు రావు అన్న ఉద్దేశంతోనే ఇలా సరోగసి ద్వారా పిల్లలను కన్నారు అంటూ చాలామంది కామెంట్లు చేశారు.అయితే ఈ వ్యాఖ్యలపై వేణు స్వామి( Venu Swamy ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి.
తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ లో నయనతార పిల్లల గురించి మాట్లాడుతూ.నయనతార అందం పాడవుతుందని తనకు సినిమా అవకాశాలు రావు అనే ఉద్దేశంతో పిల్లల్ని కనకుండా సరోగసి ద్వారా తల్లిగా మారారు అంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవమని తెలిపారు. ఆమె జాతకంలో సంతానయోగం లేదు.సంతానం కావడానికి ఆమెకు సమస్యలు ఉన్నాయి అందుకే ఇలా సరోగసి ద్వారా తల్లిగా మారారు తప్ప అందం గురించి కాదని ఈయన కొట్టి పారేశారు.
ఎంతోమంది సెలబ్రిటీలు పిల్లల్ని కని సినిమాలు చేస్తున్నారు కానీ నయనతారకు ఉన్న సమస్యలు కారణంగా తనకు సంతానయోగం లేదని ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.