ఏపీ ప్రభుత్వ సిట్‎పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ ప్రభుత్వ సిట్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జగరనుంది.అమరావతి భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

 Hearing On Ap Government Sit Today In Supreme Court-TeluguStop.com

సిట్ ఏర్పాటుపై సెప్టెంబర్ 15న ఏపీ హైకోర్టు స్టే విధించింది.అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

దీనిపై సుప్రీంలో ప్రభుత్వ వాదనలు నిన్న ముగిశాయి.ఇవాళ ప్రతివాదుల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించనున్నారు.

గత ప్రభుత్వ విధాన, ఆర్థిక నిర్ణయాలు, ఇతర అంశాలపై సిట్‌తో విచారణ జరపాలని ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఇందులో ప్రతివాదులుగా టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ లు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube