తెలుగు ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన పరిచయాన్ని ఆయనే పెంచేసుకున్నాడు.
ఇక ఈయన పేరు, చేసే కామెంట్లు క్షణాల్లో వైరల్ గా మారాల్సిందే.నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్మ స్టైలే వేరు.
ఇక ఆయన చెప్పిందే సత్యం అంటాడు.ఆయన చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు.
అలా వర్మ ప్రతి ఒక్క విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ మంచి పేరు, గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోలను స్టార్ లుగా మార్చాడు.ఎంతోమంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి సక్సెస్ ను అందుకున్నాయి.
కానీ ఈ మధ్య వర్మ స్టైల్ మొత్తం మారిపోయింది.
తనలోనే కాదు సినిమా విషయంలో కూడా వర్మ మొత్తం స్టైల్ మారుస్తూ బాగా కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నాడు.కొత్త నటీనటులతో కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
చాలావరకు బోల్డ్ కంటెంట్తో ప్రేక్షకులను మరోలా ఆకట్టుకుంటున్నాడు.

అంతే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను కూడా తన కథలోని చేర్చుకొని బాగా వైరల్ గా మారుస్తుంటాడు.ముఖ్యంగా రాజకీయ నాయకులను బాగా దృష్టిలో పెట్టుకొని వాళ్ల నేపథ్యంలో కూడా సినిమాలను తెరకెక్కిస్తాడు.వర్మ దర్శకుడిగా కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల వల్ల మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.
వర్మ చేసే పోస్టులు మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తాయి.ఒక్కోసారి వివాదాలను కూడా సృష్టిస్తాయి.కానీ ఆయన మాత్రం వాటిని అస్సలు పట్టించుకోడు.తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు.
ఇక సెలబ్రిటీలతో దిగిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వర్మ తనను ఇంటర్వ్యూ చేసే అమ్మాయిలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ నోటిమీద వేలేసుకునేలా చేస్తాడు.

ఈయన ఏదైనా సినీ ఈవెంట్ల వేడుకలో మాట్లాడితే చాలు అవి బాగా హట్ టాపిక్ గా మారుతాయి.ఎవరైనా మరణిస్తే వారికి సంతాపం మరోలా తెలుపుతాడు వర్మ.ఇటీవల కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.దీంతో కృష్ణ చనిపోయాడని బాధపడొద్దు అంటూ పైనున్న తన భార్యతో డ్యూయెట్ వేసుకుంటున్నాడు అని పోస్ట్ చేయగా అది మాత్రం బాగా వైరల్ అయింది.
అయితే ఇదంతా పక్కన పెడితే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.
యాంకర్ ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు ఇచ్చాడు.ఏం మాట్లాడినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి అంటూ ఒక ఉదాహరణతో కూడా తెలిపాడు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు బాగా వైరల్ గా మారాయి.దీంతో ఈయన మాటలు విన్న నెటిజన్స్ నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ బాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







