'స్నేక్‌ వైన్‌' గురించి విన్నారా? ఎలా తయారు చేస్తారంటే?

స్నేక్‌ వైన్‌( Snake wine ) గురించి మీరు వినే వుంటారు.అదేనండి పాములతో తయారయ్యే మద్యం సంగతి మీకు తెలుసా? ఏంటి పాము అనగానే హడలెత్తిపోతున్నారా? ఈ మధ్య చాలా ఫేమస్ అండీ బాబు.ఈ తరహా మద్యం తయారు చేయడానికి ముందుగా వరి ధాన్యంతో పాటు ఇతర దినుసులతో మద్యం తయారు చేస్తారు.ఆ తరువాతా దానిలో బతికున్న లేదా చచ్చిన పామును ఉంచి, కొన్ని నెలలు, కాదంటే సంవత్సరాలు పాటు నిల్వ చేస్తారు.

 Heard Of 'snake Wine' How Is It Made, Snake Wine, Making, Viral Latest, News Vir-TeluguStop.com

ఈ రకంగా తయారు చేసిన మద్యాన్ని పలు చికిత్సలలో కూడా వాడుతారనుకోండి.అందుకే వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా సేవిస్తారు.

Telugu Snake Wine, Latest-Latest News - Telugu

స్నేక్‌ వైన్‌ను బేసిగ్గా చైనాలో ఎక్కువగా తయారు చేస్తుంటారు.దీనిని తొలిసారి పశ్చిమ జోవు వంశానికి చెందినవారు తయారు చేశారని చరిత్రకారులు చెబుతారు.అనంతరం కాలంలో ఈ మద్యానికి చైనా( China ) అంతటా ఆదరణ దక్కిందని భోగట్టా.చైనా మాత్రమే కాకుండా దక్షిణాసియా, లావోస్‌, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, కంబోడియా, జపాన్‌లలోనూ కూడా ఈ మద్యాన్ని తయారు చేస్తుంటారు.

ఈ మద్యాన్ని సేవించడంతో పాటు… కుష్టు వ్యాధి, అత్యధికంగా చెమట కారడం, జట్టు ఊడిపోవడం, చర్మం పొడిబారడం తదితర సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటారు.

Telugu Snake Wine, Latest-Latest News - Telugu

పలు దేశాలలో ఈ తరహా మద్యాన్ని ఔషధ దుకాణాలలో అమ్ముతూ వుంటారు.ఇక వియత్నాంలో పామును వేడికి, మగతనానికి ప్రతీకగా భావిస్తారు.అందుకే ఇక్కడ ఈ తరహా మద్యానికి ఎంతో ఆదరణ ఉంటుందని తెలుస్తోంది.

దీనిని ఇక్కడి ప్రజలు లైంగికశక్తిని పెంచే ఔషధంగా వాడుతారట.ఒకసారి ట్రై చేస్తారా? కాగా దీనిని తాగడం ఎంతవరకూ సురక్షితమనే దానిపై నిపుణులు వివరణ ఇస్తూ… వరిధాన్యంతో చేసే మద్యంలో ఇథనాల్‌ వినియోగిస్తారని, దీని వలన పాములోని విషం తొలగిపోతుందని తెలిపారు.అంతేకాకుండా ఈ తరహా మద్యం తయారీలో అత్యధిక విషం కలిగిన పాములను వినియోగించరని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube