డ‌యాబెటిస్ ఉన్న‌వారు చ‌లికాలం ఇవి తింటే చాలా డేంజ‌ర్‌!

నేటి కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న స‌మ‌స్య మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్‌.

ముఖ్యంగా చిన్న వ‌య‌సులోనే మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య మ‌రింత ఎక్కువైపోతోంది.

శరీరంలో ఉండే చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గుల వల్ల మ‌ధుమేహం ఏర్ప‌డుతుంది.ఇక ఒక్క‌సారి మ‌ధుమేహం బారిన ప‌డ్డారంటే.

జీవితకాలం ఆ స‌మ‌స్య‌తో బాధ ప‌డాల్సి ఉంటుంది.అలాగే దీర్ఘ‌కాలంగా మందులు వాడుతూ.

ఆహార జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.ఇక ప్ర‌స్తుతం చ‌లి కాలం.

Advertisement

ఈ సీజ‌న్‌లో తీవ్ర‌మైన చ‌లితో పాటుగా రోగాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.అయితే ఈ వింట‌ర్ సీజ‌న్‌లో మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ఆరోగ్యంపై మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా కొన్ని ఆహారాల‌కు దూరంగా ఉండాలి.మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

సాధార‌ణంగా చ‌లి కాలంలో జ‌లుబు, ద‌గ్గు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను నివారించుకునేందుకు తేనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుందారు.

కానీ, డ‌యాబెటిస్ ఉన్న వారు మాత్రం తేనెకు దూరంగా ఉండ‌ట‌మే మంచిది.ఎందుకంటే, తేనె నేచురల్ స్వీటెనర్.అందువ‌ల్ల‌, తేనెను మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు తేనెను తీసుకుంటే.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగిపోతాయి.ఇక చ‌లి కాలంలో కాఫీ, టీల‌ను ఎక్కువ‌గా సేవిస్తుంటారు.

Advertisement

కానీ, డ‌యాబెటిస్ ఉన్న వారు వీటిని తీసుకుంటే.బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరిగిపోతాయి.

అందువ‌ల్ల‌, వాటికి దూరం ఉండ‌డండి.ఒకవేళ తాగాలి అనిపిస్తే.

రోజుకు ఒక క‌ప్పు షుగ‌ర్ లేకుండా మాత్ర‌మే తీసుకోవాలి.

అలాగే ఈ సీజ‌న్‌లో చ‌లిని త‌ట్టుకునేందుకు ఆల్కహాల్ సేవిస్తుంటారు చాలా మంది.కానీ, మ‌ధుమేహం ఉన్న వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆల్క‌హాల్ తీసుకోరాదు.ఆల్క‌హాల్ డ‌యాబెటిస్ రోగుల‌కు చాలా హానిక‌రం.

ఇక ఈ సీజ‌న్‌లో మొక్కజొన్న మ‌రియు మొక్క‌జొన్న పిండితో త‌యారు చేసిన వంట‌ల‌ను మ‌ధుమేహం రోగులు తీసుకోక‌పోవ‌డం చాలా ఉత్తమం.మొక్క‌జొన్న ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.మ‌ధుమేహం ఉన్న వారికి మాత్రం అంత మంచిది కాదు.

ఇక వీటితో పాటుగా పండ్ల రసాలు, చ‌క్కెర ఉన్న పానియాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

తాజా వార్తలు