రోజుకో క‌ప్పు కాఫీ తాగితే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

కాఫీ.అమితంగా ఇష్ట‌ప‌డే పానీయాల్లో ఇది కూడా ఒక‌టి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కాఫీ ల‌వ‌ర్స్ కోట్ల‌లో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదేమో.

దాదాపు చాలా మందికి ఉద‌యం లేవ‌గానే ఓ క‌ప్పు కాఫీ తాగ‌నిదే రోజు గ‌డ‌వ‌దు.అయితే కొంద‌రు మాత్రం కాఫీ ఆరోగ్యానికి మంచిది కాద‌ని న‌మ్ముతుంటారు.

ఈ క్ర‌మంలోనే కాఫీ తాగ‌డానికి వెనుక‌డుగు వేస్తుంటారు.అయితే రోజుకో క‌ప్పు కాఫీ తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌తిరోజు ప‌రిమితిని మించ‌కుండా కాఫీని తీసుకుంటే.హార్ట్ స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లెమ్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.

Advertisement

అలాగే రోజుకో క‌ప్పు కాఫీ తాగ‌డం వ‌ల్ల మ‌ధుమేహం, క్యాన్సర్ వంటి జ‌బ్బులు రాకుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.ఇక కొంతమంది జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతుంటారు.

అలాంటి వారి ప్ర‌తిరోజు క‌ప్పు కాఫీ తాగితే.మొద‌డు షార్ప్‌గా ప‌నిచేస్తుంది.

అదేవిధంగా.ఒత్తిడి, నీర‌సం త‌గ్గించ‌డంలో కాఫీ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.

అందుకే ఒత్తిడిగా, అల‌స‌ట‌గా ఉన్న‌ప్పుడు క‌ప్పు కాఫీ తీసుకోమ‌ని చెబుతున్నారు నిపుణులు.అయితే కాఫీ తాగే విష‌యంలో మాత్రం కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!

అందులో ముఖ్యంగా.ఖాళీ కడుపుతో ఉన్న‌ప్పుడు కాఫీని సేవించ‌డం ఆరోగ్యానికి మంచిది కాదు.

Advertisement

ఇలా చేయ‌డం వల్ల పైత్య రసం పెరుగుతుంది.శరీరంలో పైత్య రసం పెరగడం వల్ల.

తల నొప్పి, గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌లు త‌ల్లెత్తుతాయి.అలాగే పరగడుపున కాఫీని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందుకే ఏదైనా ఆహారం లేదా ఒక గ్లాస్ మంచినీరు తీసుకుని.అనంత‌రం కాఫీ తాగితే మంచిది.

తాజా వార్తలు