ఇయర్ రింగ్స్ ధరించడం వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?

సాధారణంగా ఆడ పిల్లలకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చెవులు కుట్టిస్తూ ఉంటారు.

ముఖ్యంగా బంగారంతో త‌యారు చేయించిన చెవిపోగులు( Ear Rings ) కుట్టించ‌డం అనేది శతాబ్దాల కాలం నుంచి సాంప్ర‌దాయంగా వ‌స్తోంది.

పైగా ఆడ‌పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం వ‌ల్ల మ‌రింత అందంగా, ముద్దుగా క‌నిపిస్తుంటారు.అయితే కేవలం అలంకరణ కోసమే కాదు చెవులు కుట్టించడం వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి.

అస‌లు ఇయర్ రింగ్స్ ధరించడం వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.చెవులు కుట్టించుకోవడం వల్ల మెదడు( Brain ) సక్రమంగా అభివృద్ధి చెందుతుందని చెబుతారు.

చెవి లోబ్స్ మెదడు యొక్క ఎడమ అర్ధగోళానికి, కుడి అర్ధగోళాన్ని కలిపే మెరిడియన్ పాయింట్‌ను కలిగి ఉంటాయి.చెవిపోగులు ధ‌రించ‌డం వ‌ల్ల మెదడు యొక్క ఆరోగ్యకరమైన మరియు శీఘ్ర అభివృద్ధికి స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

చెవిలోని నరాలు కంటికి అనుసంధానించబడి ఉంటాయి.అందువల్ల చెవిపోగులు ధ‌రిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది.

అలాగే గోల్డ్ ఇయ‌ర్ రింగ్స్ ను ధ‌రించ‌డం వ‌ల్ల తలనొప్పి మరియు మైగ్రేన్( Migraine ) వంటి బాధాకరమైన పరిస్థితుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.చెవి పోగులు చెవిలోని బిందువులకు ఒత్తిడిని వర్తింపజేయడం వ‌ల్ల ఓసీడీ, ఆందోళన మరియు భయము వంటి మానసిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

బంగారు చెవిపోగులు ధ‌రించ‌డం వ‌ల్ల‌ మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.బంగారు చెవిపోగులు ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.

ఆర్థరైటిస్( Arthritis ) నొప్పిని త‌గ్గిస్తాయి.

అయ్యబాబోయ్.. పాములు గుడ్డులోనుండి ఎలా పుడతాయంటే?(వీడియో)
న్యూస్ రౌండప్ టాప్ 20

అంతేకాకుండా బంగారం చెవిపోగులు బాడీలో మంటను తగ్గించగలదని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నమ్ముతారు.చెవిపోగులు చెవిలోని పాయింట్లను ఉత్తేజపరిచి మీ జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడ‌తాయి.చెవి పోగులు ధ‌రించ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య దూరం అవుతుంద‌ని అంటారు.

Advertisement

ఇక ఆడ‌వారే కాదు కొంద‌రు మ‌గ‌వారు కూడా చెవిపోగులు ధ‌రిస్తుంటారు.మగవారిలో చెవిపోగులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు, హైడ్రోసిల్ మరియు హెర్నియా రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు