అమిత్ షాతో లోకేష్ భేటీ .. అందుకోసమేనా ? 

టిడిపి , జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) సైలెంట్ గానే ఉంటున్నారు.రాజకీయంగా ఎక్కడా హడావుడి చేయకుండా తన పని తాను చూసుకుంటున్నాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

 Minister Nara Lokesh Key Discussions With Central Minister Amit Shah Details, Td-TeluguStop.com

ఒకవైపు తన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూనే , మరోవైపు తెరవెనుక రాజకీయ వ్యూహాలకు లోకేష్ పదును పెడుతున్నారు.ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో రాజకీయాలకు లోకేష్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎక్కడికక్కడ వైసీపీకి చెక్ పెట్టే విధంగా , గత వైసిపి ప్రభుత్వం లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాల పైన లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సాధించారు.

Telugu Ap, Jagan, Janasena, Lokeshmeet, Lokesh-Politics

ఇక తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో నిన్న లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.అయితే లోకేష్,  అమిత్ షాను కలిసింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో చేపట్టిన అనేక కార్యక్రమాలను గురించి లోకేష్ అమిత్ షాకు వివరించేందుకే అని,  రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారని, ఏపీ అభివృద్ధికి( AP Development ) కేంద్రం సహకరించాలని కోరారని , దానికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని,  ఏపీలో బలమైన శక్తిగా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారని చెబుతున్నారు.

  అయితే వీరి మధ్య మరో విషయం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ముందు రెడ్ బుక్( Red Book ) పేరుతో లోకేష్ హడావుడి చేశారు. 

Telugu Ap, Jagan, Janasena, Lokeshmeet, Lokesh-Politics

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా వ్యవహారాలు చేస్తూ,  రెడ్ బుక్ లోని వ్యక్తులను టార్గెట్ చేసుకున్నారు.అయితే ఎక్కడా దూకుడుగా వ్యవహరించకుండా,  లోకేష్ చూస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు బిజెపితో సంప్రదింపులు చేస్తూ వస్తున్నారు.రాష్ట్రస్థాయిలో బిజెపి నేతలతో సంప్రదింపులు జరిపినా,  పెద్దగా ప్రయోజనం ఉండదని, జాతీయస్థాయిలో కీలకమైన విషయాలపై బిజెపి పెద్దలతోనే మాట్లాడాల్సి ఉంటుందని లోకేష్ భావిస్తున్నారు.దీనిలో భాగంగానే అమిత్ షాను కలిసినట్లు సమాచారం.

ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న నేరాలపైన,  ఆ పార్టీ నాయకుల అరాచకాల పైన పూర్తి ఆధారాలను సేకరించి , వాటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పిస్తున్నారట.  వీటిపైనే ప్రధానంగా అమిత్ షా తో చర్చించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube