కొలెస్ట్రాల్ క‌రిగించే పీనట్ బట‌ర్.. ఆ బెనిఫిట్స్ కూడా!

వేరుశెన‌గ‌లు ఆరోగ్యానికి ఎంత‌ మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

అయితే వెరుశెన‌గ‌ల‌తో త‌యారు చేసే పీన‌ట్ బ‌ట‌ర్ కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ముఖ్యంగా పిల్ల‌లు పీన‌ట్ బ‌ట‌ర్‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారు.కానీ, పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకోవ‌డానికి చాలా మంది జంకుతుంటారు.

పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకుంటే అధిక బ‌రువు పెరిగిపోతార‌ని, అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చాలా మంది న‌మ్ముతారు.కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదు.

మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్‌ పీన‌ట్ బ‌ట‌ర్‌లో పుష్క‌లంగా ఉంటాయి.పీన‌ట్ బ‌ట‌ర్‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

Advertisement

పీన‌ట్ బ‌ట‌ర్‌లో మోనో శాట్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.ఇది శ‌రీరంలో అద‌న‌పు కొలెస్ట్రాల్‌ను‌, కేల‌రీల‌ను క‌రిగిస్తుంది.

అధిక బ‌రువు స‌మ‌స్య‌ను త‌‌గ్గిస్తుంది.అలాగే పీన‌ట్ బ‌ట‌ర్‌ను పిల్ల‌ల‌కు పెట్ట‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్‌ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌పర‌చి.

రోగాల‌ను దూరం చేస్తుంది.

రెగ్యుల‌ర్‌గా పీనట్ బటర్ లో తీసుకుంటే.అందులో ఉండే అన్ సాట్యురేటెడ్ యాసిడ్స్ మ‌ధుమేహం బారిన ప‌డే రిస్క్ త‌గ్గిస్తుంది.అలాగే పీన‌ట్ బ‌ట‌ర్‌లో మెగ్నీషియం, కాల్షియం స‌మృద్ధిగా ఉంటాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కాబ‌ట్టి, దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు మ‌రియు కండ‌రాలు దృఢంగా మార‌తాయి.అధిక ఒత్తిడి స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు ప్ర‌తి రోజు పీన‌ట్ బ‌ట‌ర్‌ను తీసుకుంటే.

Advertisement

మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అదేవిధంగా, పీన‌ట్ బ‌ట‌ర్‌లో ఉంటే విట‌మిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది.

విట‌మిన్ ఈ చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మ‌రియు తాజాగా ఉండేలా చేస్తుంది.ఇక పిల్ల‌ల‌కు పీన‌ట్ బ‌ట‌ర్ ఇవ్వ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుప‌డ‌టంతో పాటుగా ఆక‌లి కూడా పెరుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి క‌దా అని అధికంగా మాత్రం పీన‌ట్ బ‌ట‌ర్‌ను తీసుకోరాదు.కేవ‌లం రోజుకు ఒక‌టి టీ స్పూన్ లేదా ఒక‌టిన్న‌ర టీ స్పూన్ మాత్ర‌మే తీసుకోవాలి.

తాజా వార్తలు