జీల‌క‌ర్ర‌, పెరుగు క‌లిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

నిత్యం వాడే వాటిలో జీల‌క‌ర్ర‌, పెరుగు ఈ రెండూ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.విడిగా విడిగా రెండూ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

రెండిటిలోనూ మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు దాగి ఉన్నాయి.అయితే ఈ రెండిటినీ విడి విడిగా కాకుండా క‌లిపి తీసుకుంటే.

మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ఇటీవ‌ల కాలంలో అధిక బ‌రువు స‌మ‌స్య ఎంద‌రినో వేధిస్తున్న సంగ‌తి తెలిసిందే.అధిక బ‌రువు ఉన్న వారిని ఇతరులు సూటి పోటి మాట‌ల‌తో ఇబ్బంది పెడుతుంటారు.

Advertisement

దీంతో వారు శ‌రీర‌కంగానే కాకుండా మాన‌సీకంగా కూడా కృంగిపోతుంటారు.ఇక ఈ క్ర‌మంలోనే డైటింగ్లు, వ్యాయామాలు చేస్తూ.

ఎలాగైనా బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.అయితే జీల‌క‌ర్ర‌, పెరుగు కాంబినేష‌న్ బ‌రువు త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

ప్ర‌తి రోజు ఒక స్పూన్ పెరుగులో అర స్పూన్ జీల‌క‌ర్ర క‌లిపి తీసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.ఖ‌చ్చితంగా శ‌రీరంలో అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.

ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.అలాగే పెరుగులో జీల‌క‌ర్ర క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

ముఖ్యంగా గ్యాస్‌, ఎసిడిటీ, గుండెలో మంట వంటి స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.అలాగే క‌డుపు నొప్పి వ‌చ్చిన‌ప్పుడు పెరుగులో జీల‌క‌ర్ర క‌లిపి తీసుకుంటే త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అయిపోతారు.

Advertisement

త‌ల‌నొప్పి ఇబ్బంది పెడుతుంటే.ఒకటి, రెండు స్పూన్ల పెరుగులో జీల‌క‌ర్ర లేదా జీల‌క‌ర్ర పొడి క‌లిపి తీసుకుంటే వెంట‌నే రిలీఫ్ పొందుతారు.

ఇక జీల‌క‌ర్ర, పెరుగు క‌లిపి తీసుకుంటే.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

దాంతో సీజ‌న‌ల్‌గా వ‌చ్చే రోగాల‌కు దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు