రోజుకో ట‌మాటా తింటే ఆ స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ట‌.. తెలుసా?

ఎర్ర‌గా చూడ‌గానే ఆక‌ర్షించే ట‌మాటాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.ట‌మాటాల‌తో ఎన్నో ర‌కాల వంట‌లు త‌యారు చేస్తుంటారు.

ట‌మాటాల‌ను ఏ కూర‌లో వేసినా.రుచి అద్భుతంగా ఉంటుంది అన‌డంలో సందేహ‌మే లేదు.

కేవ‌లం రుచిలోనే కాదు.ట‌మాటాతో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా పొందొచ్చు.

కానీ, కొంద‌రు మాత్రం ట‌మాటాల‌ను తినేందుకు సంకోచిస్తుంటారు.ట‌మాటా తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీ స‌మ‌స్య‌లు, గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చాలా మంది భావిస్తుంటారు.

Advertisement

కానీ, నిజానికి రోజుకో ట‌మాటాను తీసుకుంటే.అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

ట‌మాటాల్లో విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల రోజుకో ట‌మాటాను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.ప్రాణాంత‌క‌ర‌మైన క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిని అడ్డుకునే శ‌క్తి కూడా ట‌మాటాకు ఉంది.

ఒక ట‌మాటా చ‌ప్పున‌ రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.అందులో ఉండే లైకోపీన్ ప్రొస్టేట్, లంగ్, కొలెన్ ఇలా ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

అలాగే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఉన్న వారు ఒక ట‌మాటాను ప్ర‌తి రోజు తీసుకోవాలి.దాంతో ట‌మాటాలో ఉండే ఫైబ‌ర్ మ‌రియు వాట‌ర్ కంటెంట్.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

Advertisement

కాల్షియం మ‌రియు పొటాషియం కూడా ట‌మాటాలో ఉంటాయి.అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు ట‌మాటాను తీసుకుంటే.

ఎముక‌లు, దంతాలు, కండ‌రాలు దృఢంగా ఉంటాయి.

అదేవిధంగా, మ‌ధుమేహం ఉన్న వారికి కూడా ట‌మాటా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.రెగ్యుల‌ర్‌గా ఒక ట‌మాటా తీసుకుంటే.అందులో ఉండే క్రోమియం బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

ఇక ప్ర‌తి రోజు ఒక ట‌మాటా చ‌ప్పున తీసుకుంటే.గుండె పోటు మ‌రియు గుండె సంబంధిత జ‌బ్బ‌లు కూడా ద‌రిచేర‌కుండా ఉంటాయి.

అదే స‌మ‌యంలో ర‌క్త పోటు కూడా అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు