తిక్క కుదిరింది.. మోసం చేయాలనుకుని భారీగా మోసపోయాడు

ఎదుటి వారికి హాని చేయాలనుకుంటే మనకు కూడా అదే అనుభవం ఎదరవుతుంది.అందుకే ఎవరు తీసిన గోతిలో వారే పడుతుంటారు అనే సామెతను పెద్దలు చెబుతుంటారు.

ఎక్కడైనా చేతి వాటం ప్రదర్శిస్తే మనకు కూడా అదే తరహాలో జరగొచ్చు.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి మార్కెట్‌లో చిరు వ్యాపారి వద్ద తన చోర కళ ప్రదర్శించాడు.తీరా ఆ వ్యాపారి కూడా అతడికి అదే తరహాలో బుద్ధి చెప్పాడు.

దీంతో ఈ వీడియో చూసిన వారంతా తగిన శాస్తి జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సాధారణంగా మనం రద్దీగా ఉన్న మార్కెట్లలో వెళ్తున్నప్పుడు రోడ్ల పక్కన ఎందరో చిరు వ్యాపారులు వ్యాపారం సాగిస్తుంటారు.వారి వద్ద కూడా నాణ్యమైన వస్తువులు, పండ్లు, కూరగాయలు ఉంటాయి.కొందరు సూపర్ మార్కెట్లలో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినా, మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన ప్రజలు మాత్రం సాధారణంగా ఇలాంటి చోట్ల కొనుగోలు చేస్తుంటారు.అయితే కొందరు మాత్రం వక్ర బుద్ధి చూపిస్తుంటారు.

వ్యాపారులను బురిడీ కొట్టించి, కొన్ని వస్తువులు లేదా పండ్లు వంటివి తస్కరిస్తారు.అయితే ప్రస్తుతం అమాయకులు ఎవరూ లేరు.

వ్యాపారులు కూడా తగిన తెలివి ప్రదర్శిస్తున్నారు.మనం చూసేటప్పుడు అన్నీ బాగానే వేసినా, చూపు పక్కకు తిప్పే సమయంలో రెప్ప పాటులో తూకం తగ్గించేస్తున్నారు.

ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఓ వ్యక్తి పండ్లు కొనేందుకు వచ్చి వ్యాపారి చూడకుండా కొన్ని పండ్లు తన జేబులో వేసుకుంటాడు.

ఆ వ్యాపారి కూడా తన తెలివిని ప్రదర్శిస్తాడు.తూకంలో భారీ తేడా వచ్చేలా చేస్తాడు.

దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.ఒకరిని మోసం చేద్దామనుకుంటే మనకు కూడా అదే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

మోసం చేయాలనుకున్న వ్యక్తికి బాగా తిక్క కుదిరిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube