అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఎర్పడింది.ఈ మధ్య కాలంలో న్యూయార్క్ రాష్ట్రంలోకి ఎంతో మంది అక్రమ వలస దారులు భారీ సంఖ్యలోకి రావడంతో నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు.
గడిచిన కొంత కాలంగా అమెరికా సరిహద్దు ప్రాంతాల నుంచీ వేలాది మంది వస్తున్నారని వారందరినీ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఉంచుతున్నామని ఈ క్రమంలో నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ యొక్క ముఖ్య లక్ష్యం కోల్పోతోందని ఆడమ్స్ అన్నారు.
న్యూయార్క్ లోని స్థానికంగా ఉన్న సిటీ హాల్ లో మాట్లాడుతూ న్యూయార్క్ లోకి భారీ సంఖ్యలో శరణార్థులు వస్తున్నారని వారికోసం బిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ ప్రభావం తమ ఆర్ధిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆడమ్స్ తెలిపారు.
కేవలం ఒక్క ఏప్రియల్ నెలలో సుమారు 20 వేల మందికి పైగా వలస వాసులు వచ్చారని గడిచిన కొంత కాలంగా ప్రతీ రోజు ఐదు నుంచీ 6 బస్సులలో శరణార్థులు న్యూయార్క్ వస్తున్నారని అన్నారు.శరణార్థులు ఆదరించడం మంచిదే కానీ వీరికి ఆహారం, వసతి ఏర్పాటు చేయడంతో భారీగా ఖర్చు అవుతోందని అంత డబ్బు ఎక్కడి నుంచీ తీసుకురావాలని అన్నారు.

నిధుల కొరతతో ఉన్న తమను ఫెడరల్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని కోరారు ప్రస్తుతం వారి రాకడను తగ్గించడం తప్ప తాము ఏమి చేయలేమని అందుకే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని ఆడమ్స్ ప్రకటించారు.తమను ఇబ్బందులకు గురి చేయడానికి రిపబ్లిక్ పార్టీ కి చెందిన టెక్సాస్ బస్సులలో శరణార్థులను న్యూయార్క్ పంపుతున్నారని దాదాపు 3 వేల మందిని ఇలా తమ నగరానికి తరలించాడని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ నగరంలోకి పంపడం వలన వారికి కావాల్సిన అవసరాలు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని ఆడమ్స్ మీడియా సమావేశంలో వెల్లడించారు.







