నా స్టామినాను సహనంతో భరిస్తాడు... శృతిహాసన్ పోస్టు వైరల్!

లెజెండరీ యాక్టర్ కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ (Shruti Haasan) స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.చాలా కాలం సినిమాలకు దూరమైన ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటుంది.

 He Bears My Stamina With Patience Shruti Haasan Post Goes Viral Details, Shruti-TeluguStop.com

ఇటీవల వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఒకేసారి రెండు హిట్లు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.ఇలా వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వర్కౌట్స్ వీడియో వైరల్ గా మారింది.

ఇప్పటికే తన మోకాలికి గాయమైనట్టుగా శ్రుతి హాసన్ ప్రకటించిన దగ్గరి నుంచి ఆ ఫోటోలను షేర్ చేస్తూ రెండు వారాలుగా తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు శృతిహాసన్ షూట్ చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది.ప్రస్తుతం శ్రుతి హాసన్ మళ్లీ వర్కౌట్లతో బిజీగా మారింది.

వర్కౌట్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ” చాలా రోజుల తరువాత మళ్లీ స్టార్ట్ చేశా,తన పిచ్చిని, తన స్టామినాను భరిస్తాడు” అంటూ తన ట్రైనర్ (Trainer) గురించి శృతి హాసన్ చెప్పుకొచ్చింది.ఇక ఈ వీడియోలో శ్రుతి హాసన్ పిచ్చి పిచ్చిగా చేసిన విన్యాసాలు చూస్తే కచ్చితంగా నవ్వు వస్తుంది.

ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి క్రాక్ సినిమా ద్వారా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన శ్రుతి హాసన్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చేలా ఉంది.ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించి రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది.చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి వంటి శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలై సంక్రాంతి హిట్లుగా నిలిచాయి.ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “సలార్” సినిమాలో(Salaar) కూడా నటిస్తోంది.

ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube