అనన్య లాంటి పిల్ల పుడితే భరించడం కష్టం: విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే నటిస్తున్నారు.

 Having A Child Like Ananya Is Difficult To Bear Vijay Deverakonda Ananya Pandey,-TeluguStop.com

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ అనన్య పాండే ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా యాంకర్ విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ మీ లైఫ్ లో రియల్ ఫైటర్స్ అంటే ఎవరు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ ఎవరైతే జీవితంలో సంతోషంగా ఉండాలని డబ్బు కోసం సమాజంలో పేరు ప్రతిష్టల కోసం నిరంతరం కృషి చేస్తారో నా దృష్టిలో వాళ్లే రియల్ ఫైటర్స్ అంటూ సమాధానం చెప్పారు.

Telugu Ananya Pandey, Liger, Puri Jagannath, Tollywood-Movie

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ దేవరకొండ అనన్య పాండే గురించి మాట్లాడుతూ తనకు అనన్య ఒక విషయంలో ఏమాత్రం నచ్చదని తెలిపారు.ఈమె ఎప్పుడు చూడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది.అసలు ఇలాంటి అల్లరి పిల్లలు కనక నాకు పుడితే ఏం చేయాలో అని భయం వేస్తుంది అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అనన్య పాండే గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈమె చిన్నప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఈమెను భరిస్తున్న ఈమె పేరెంట్స్ కి మాత్రం హాట్సాఫ్ అంటూ ఈయన హీరోయిన్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube