ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకున్నారా.. మీ అకౌంట్ ఈజీగా హ్యాక్ కావడం ఖాయం!

గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్‌వర్డ్‌ను చాలా మంది సెటప్ చేసుకుంటారు.ఈ రోజుల్లో యాప్స్, సైట్స్ వంటి వాటిని యాక్సెస్ చేయాలంటే లాగిన్ చేయక తప్పడం లేదు.

 Have You Set Passwords Like This  Your Account Is Sure To Be Hacked Easily,nordp-TeluguStop.com

అందుకని యూజర్లు ప్రతి లాగిన్ కోసం ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుంటే వాటిని గుర్తుంచుకోవడం కష్టం అవుతుందని ఈజీ పాస్‌వర్డ్‌లను ఎంచుకుంటున్నారు.అయితే ప్రతి యూజర్ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే.

సులభమైన పాస్‌వర్డ్‌ను కొన్ని సెకన్లలో క్రాక్ చేయడం హ్యాకర్‌కి 100% సాధ్యమవుతుంది.

సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం వీక్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం వల్ల లక్షలాది మంది ఇంటర్నెట్ యూజర్ల ఆన్‌లైన్ ఖాతాలను హ్యాకింగ్‌కి గురవుతున్నాయి.

నార్డ్‌పాస్ టీమ్ తాజా స్టడీలో పాస్‌వర్డ్‌ల గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి.ఈ స్టడీ ప్రకారం చాలా మంది వ్యక్తులు “123456”, “క్వెర్టీ”, “పాస్‌వర్డ్” వంటి సింపుల్ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు.

వీటిని మిల్లీ సెకన్లలో హ్యాక్ చేయడం కుదురుతుంది.

Telugu Nordpass, Password Tips, Password, Tech Tips, Weak Passwords-Latest News

అందువల్ల మీరు ఈ వీక్ పాస్‌వర్డ్‌లలో దేనినైనా ఉపయోగిస్తున్నట్లయితే, మీరు వాటిని ఇప్పుడే మార్చడం మంచిది.వీక్ పాస్‌వర్డ్‌ల లిస్ట్‌లో 123456, 123456789, 123455, క్వెర్టీ, పాస్‌వర్డ్, 12345678, 111111, 123123, 1234567890, 1234567 వంటివి కూడా ఉన్నాయి.అలానే పాస్‌వర్డ్‌లలో ‘డాల్ఫిన్’ అనే పదం మొదటి స్థానంలో ఉంది.

ఒకవేళ ఆమె ఇప్పుడు పేర్కొన్న వాటిలో మీరు ఏదైనా పాస్వర్డ్ ఏవైనా అకౌంట్కి చేసినట్లయితే వాటిని వెంటనే మార్చడం చాలా శ్రేయస్కరం లేదంటే ఏదో ఒక సందర్భంలో హ్యాకర్ల చేతిలో మీ పర్సనల్ డేటా పడే ప్రమాదం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube