వాట్సాప్​లో కొత్త ఫీచర్ గమనించారా? రెండు రోజులైతే డిలీట్​!

ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ ఏమిటో అని ప్రత్యేకించి అడగాల్సిన పనిలేదు.ఇక్కడ ఏ చిన్న పిల్లాడినైనా అడిగినా చెప్పేస్తాడు అది వాట్సాప్‌ అని.

 Have You Noticed A New Feature In Whatsapp  Delete After Two Days , Whatsapp ,-TeluguStop.com

ప్రతి నిత్యం కోట్లాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే చాటింగ్ చేస్తూ వుంటారు.దీనిద్వారానే అవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్​ను షేర్​ చేసుకుంటారు.

ఒకప్పటిలాగా ఇపుడు ఎవరు కూడా ఇమెయిల్స్ మీద ఆధారపడటం లేదు.అయితే మనలో అనేకమంది ఒక తప్పు చేస్తూ వుంటారు.

చాటింగ్​​ చేస్తున్న సమయంలో ఓ మెసేజ్​.ఒకరికి పంపబోయి మరొకరికి పంపించేస్తూ వుంటారు.

ఆ తరువాత ఏ గంటకో రెండు గంటలకు గాని చేసుకోరు.ఆనక అయ్యో అని అనుకుంటూ వుంటారు.

అయితే ఇలాంటి పొరపాట్లు చేసేవారికోసమే వాట్సాప్​ త్వరలోనే కొత్త ఫీచర్​ను తీసుకొస్తుంది.మెసేజ్​ చేసి రెండు రోజులు అయినా డిలీట్​ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

వాట్సాప్​ చాట్​లో ‘డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్‘​ ఫీచర్​ను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది.మొదట.

ఆ ఫీచర్​ను 8 నిమిషాలకు మాత్రమే పరిమితం చేసింది.ఆ తర్వాత కొద్ది రోజులకు 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్​ చేసే అవకాశాన్నిచ్చింది.

ఇప్పుడు ఈ ఫీచర్​ను​ ఇంకాస్త సమయానికి పెంచుదామని వాట్సాప్​ అనుకుంటోంది.

Telugu Chats, Delete, Latest, Messages, Whatsappdelete, Ups, Whatsapp-Latest New

ఈ కొత్త ఫీచర్​ వచ్చాక వాట్సాప్​లో పంపిన మెసేజ్​ను 56 గంటల తర్వాత కూడా డిలీట్​ చేసుకోవచ్చు.అంటే రెండున్నర రోజులైనా పర్వాలేదన్నమాట.ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ మోడ్​లో ఉంది.మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది.

దీంతో పాటు మరో ఫీచర్​ను ​కూడా వాట్సాప్​ తీసుకురానుంది.మీరు అడ్మిన్​గా ఉన్న గ్రూప్​​లోని ఏ మెసేజ్​నైనా డిలీట్​ చేసే అవకాశాన్ని కల్పించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube